Aquaman 2 Collections 1600 కోట్ల బడ్జెట్.. 4 రోజుల్లో దారుణంగా కలెక్షన్లు.. ఇండియాలో ఎన్ని కోట్లంటే?

హాలీవుడ్‌లో భారీ అంచనాలతో వచ్చిన ఆక్వామెన్ అండ్ లాస్ట్ కింగ్‌డమ్ (ఆక్వామెన్ 2) సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నది. 2018 సంవత్సరంలో రిలీజైన అక్వామెన్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ఇండియాలోను, ఓవర్సీస్‌లోను కలెక్షన్లు రాబట్టే విధంగా ప్రభావం చూపట్టలేకపోయింది. దాంతో ఈ సినిమా వసూళ్లపరంగా తడబాటుకు గురవుతున్నది. గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఆక్వామెన్ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకొన్నది. అప్పట్లో ఈ సినిమా 1 బిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించింది. దాంతో అక్వామెన్ 2 సినిమాను 200 మిలియన్ డాలర్లు అంటే 1600 కోట్ల రూపాయలతో నిర్మించారు. అలాగే ఈ సినిమాను భారీ రేంజ్‌లో, రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Aquaman 2 first Weekend Collections Worldwide

ఆక్వామెన్ 2 సినిమాకు చైనాలో మంచి రెస్పాన్స్ లభించింది. రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. తొలి వారాంతంలో ఈ సినిమా చైనాలో 30 మిలియన్ డాలర్ల కలెక్షన్లను వసూలు చేసింది. అయితే ముందు వేసుకొన్న అంచనా ప్రకారంగా ఈ సినిమా పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోతున్నదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక ఆక్వామెన్ సినిమాకు సంబంధించిన ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 1.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 2.26 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో నాలుగు రోజుల్లో 9.5 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇంగ్లీష్ వెర్షన్ దాదాపు 6 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధిస్తే.. మిగితా భాషలకు సంబంధించిన వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

Aquaman 2 first Weekend Collections Worldwide

ఆక్వామెన్ 2 సినిమాకు అమెరికాలో గ్రాండ్‌గా ఓపెనింగ్స్ లభించాయి. క్రిస్మస్ హాలీడేస్ కావడంతో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా యూఎస్‌ఏలో 80 మిలియన్లు వసూలు చేయగా..ప్రపంచవ్యాప్తంగా 120 మిలియన్ల వసూళ్లు అంటే దాదాపు 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అయితే అంచనాలకు దిగువనే ఈ సినిమా కలెక్షన్లు రాబడుతున్నదనే వాదన వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X