Aquaman 2 Advance Booking చైనా రికార్డుల తిరగరాసిన ఆక్వామెన్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
హాలీవుడ్ స్టార్స్ నికోల్ కిడ్మన్, అంబర్ హర్డ్, ప్యాట్రిక్ విల్సన్, అబ్దుల్ మాటీన్ తదితరులు నటించిన ఆక్వామెన్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతున్నది. అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ల సాధిస్తుందనే విధంగా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ఈ మూవీ వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..
అక్వామెన్ మూవీ విషయానికి వస్తే.. 2018లో రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధించింది. ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు జేమ్స్ వాన్ దర్శకత్వం వహించగా... డేవిడ్ లెస్లీ జాన్సన్ స్క్రీన్ ప్లే అందించారు.

వార్నర్ బ్రదర్స్ డీసీ సినిమాల్లో భాగంగా వచ్చిన ఆక్వామెన్ 1 చిత్రం భారీ కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1.1 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. చైనాలో అత్యధికంగా 290 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. డీసీ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌లో భాగంగా వచ్చిన చిత్రాల్లో అత్యధికంగా వసూళ్లను సాధించింది.
అక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్ మూవీకి చైనాలో భారీ రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ సినిమా ది మార్వెల్, ది బ్యాట్‌మెన్ సినిమాలను మంచి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు సాధించింది. ది మార్వెల్ మూవీ 950K డాలర్లు వసూలు చేస్తే.. ది బ్యాట్‌మెన్ సినిమా 960K కలెక్షన్లను రాబట్టింది. అయితే అక్వామెన్ 2 చిత్రం ఈ రెండు చిత్రాల కంటే ఎక్కువగా అంటే.. 980 డాలర్లు వసూలు చేసింది.

అయితే అక్వామెన్ 2 మూవీ తొలి వారాంతం ఓపెనింగ్స్ భారీగానే ఉండే అవకాశం ఉంది. ఈ సినిమా అమెరికాలో 40 మిలియన్ డాలర్లు, అలాగే ప్రపంచవ్యాప్తంగా 70 మిలియన్ డాలర్లు అంటే 580 కోట్ల రూపాయలు వసూలు చేసే ఛాన్స్ కనిపిస్తున్నది. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే ఇంకా భారీగా వసూళ్లు సాధించగలదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











