Aquaman 2 దిమ్మతిరిగే బడ్జెట్.. రికార్డుస్థాయిలో ఆక్వామెన్ 2 బిజినెస్.. బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా?
హాలీవుడ్‌లో పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన ఆక్వామన్ అండ్ లాస్ట్ కింగ్‌డమ్ (ఆక్వామెన్ 2) మూవీ ఎట్టకేలకు విడుదలకు నోచుకొన్నది. హిందీలో షారుక్ ఖాన్ నటించిన డంకీ, తెలుగులో ప్రభాస్ నటించిన సలార్ మూవీతో పోటీపడుతూ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22 తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. అయితే DC ఎక్స్‌టెండెడ్ యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సంబంధించిన వివరాలతోపాటు బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..
ఇక ఆక్వామెన్ సినిమా నటీనటులు, సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. బెన్ అఫ్లెక్, జాసన్ మోమో, ప్యాట్రిక్ విల్సన్, నికోల్ కిడ్మన్, అంబర్ హర్డ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు జేమ్స్ వాన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాబ్ కోవాన్, పీటన్ సఫ్రాన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు రూపర్ట్ గ్రెగ్‌సన్ విలియమ్స్ మ్యూజిక్, డాన్ బుర్గెస్ సినిమాటోగ్రఫి, కిర్క్ ఎం మోరీ ఎడిటింగ్ అందిస్తున్నారు.

హాలీవుడ్ నటి అంబర్ హర్డ్ తన భర్త జానీ డెప్‌తో విడాకులు, తదితర అంశాలపై న్యాయ పోరాటం చేయడం ఈ సినిమాను వివాదాల్లోకి నెట్టింది. వివాదాస్పదంగా మారిన అంబర్ హర్డ్ కారణంగా ఈ సినిమా నుంచి ఆమెను తప్పించాలని హాలీవుడ్‌లో డిమాండ్ బలంగా వినిపించింది. ఆమె ఉండటం కారణంగా ఈ సినిమాకు అంతగా బజ్ రావడం లేదనే విషయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే డీసీ ఎక్స్‌టెండెడ్ సిరీస్‌లకు పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఆక్వామెన్ సినిమా కష్టంగా 1 బిలియన్ డాలర్ మార్క్ చేరుకొన్నది. ఆ సంస్థ నిర్మించిన షాజమ్ మాత్రమే భారీ విజయాన్ని అందుకొన్నది. షాజమ్ సినిమాను 85 మిలియన్ డాలర్లతో నిర్మిస్తే.. 365 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లను సాధించింది.

ఇక ఆక్వామెన్ 2 (ఆక్వామెన్ అండ్ లాస్ట్ కింగ్‌డమ్) మూవీని 205 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 410 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా బిజినెస్ కూడా ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేసింది.

ఆక్వామెన్ 2 (ఆక్వామెన్ అండ్ లాస్ట్ కింగ్‌డమ్) సినిమాకు ప్రధానంగా క్రిస్మస్, న్యూ ఇయర్ హాలీడేస్ కలిసి వచ్చే అంశంగా కనిపిస్తున్నది. ఈ సినిమా టాక్ పాజిటివ్‌గా ఉంటే కలెక్షన్లకు ఎలాంటి ఢోకా ఉండదనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











