twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రికార్డు సృష్టించిన దిల్ బేచారా.. థియేటర్లో రిలీజై ఉంటే 2000 కోట్ల కలెక్షన్లు.. ఏఆర్ రెహ్మాన్ ట్వీట్

    |

    బాలీవుడ్ హీరో, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన దిల్ బేచారా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూవర్‌షిప్ సాధించిన చిత్రంగా రికార్డును స్థాపించింది. ముఖేష్ చాబ్రా దర్శకత్వంలో వచ్చిన దిల్ బేచారా సుశాంత్ చివరి చిత్రం కావడం తెలిసిందే. జూన్ 12వ తేదీన సుశాంత్ మరణించిన తర్వాత విడుదల కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఆదరణ కనబరిచారు. ఇక సినిమా సాధించిన రికార్డుల గురించి ఏఆర్ రెహ్మాన్ వెల్లడిస్తూ..

    24 గంటల్లోనే 95 మిలియన్లు

    24 గంటల్లోనే 95 మిలియన్లు

    దిల్ బేచారా చిత్రం జూలై 25వ తేదీన సాయంత్రం 7 గంటల ప్రాంతంలో డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీ ఫ్లాట్‌ఫాం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 95 మిలియన్ల (95 కోట్లు) మంది వీక్షించారు. ఇది ప్రపంచ సినిమా చరిత్రలోనే ఓ అరుదైన రికార్డుగా చెప్పుకొంటున్నారు.

    గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కు పోటీగా

    గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కు పోటీగా

    ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాలను ఆకట్టుకొన్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ చిత్రంతో దిల్ బేచారా పోటీ పడిందని, ఆ సినిమా వ్యూవర్ షిప్ డేటా లేని కారణంగా ఆ మూవీ రికార్డును అధిగమించిందా అనేది చెప్పలేకుండా ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫైనల్ సీజన్‌నను 44 మిలియన్ల మంది వీక్షించారు అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా దిల్ బేచారా ఓ ఘనతను సాధించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    ఎక్ట్ర్సాక్షన్ మూవీ రికార్డుకు చేరువగా

    ఎక్ట్ర్సాక్షన్ మూవీ రికార్డుకు చేరువగా

    ఇక నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన క్రిస్ హేమ్స్‌వర్త్ నటించిన ఎక్ట్ర్సాక్షన్ మూవీని ఒక నెలరోజుల్లో 99 మిలియన్ల మంది వీక్షించారు. అయితే ఆ రికార్డు చేరువగా దిల్ బేచారా ఉంది. కానీ దిల్ బేచారా చిత్రం కేవలం 24 గంటల్లోనే 95 మిలియన్ల మంది వీక్షించడం ఓ రికార్డు అని అంటున్నారు.

    థియేటర్లలో రిలీజై ఉంటే 2000 కోట్ల వసూళ్లు

    థియేటర్లలో రిలీజై ఉంటే 2000 కోట్ల వసూళ్లు

    కరోనా వైరస్ కారణంగా దిల్ బేచారా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయలేకపోయారు. ఒకవేళ థియేటర్లలో రిలీజై ఉంటే.. టికెట్ ధర రూ.100 ప్రకారం అంచనా వేస్తే ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.950 కోట్లు వసూలు చేసి ఉండేది. ఇక మల్టీప్లెక్స్‌లో ఉండే సగటు టికెట్ ధర రూ.207 ప్రకారం అంచనా వేస్తే ఈ చిత్రం 2000 కోట్లకుపైగానే వసూలు చేసి ఉండేది అనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

    Recommended Video

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
    ఏఆర్ రెహ్మాన్ ట్వీట్ చేసి..

    ఏఆర్ రెహ్మాన్ ట్వీట్ చేసి..

    ఇక దిల్ బేచారా సినిమా సాధించిన రికార్డును సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ట్వీట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా 95 మిలియన్ల మంది చూశారు. ఆ సినిమా థియేటర్లో వస్తే 2000 కోట్ల వసూళ్లను సాధించేదని జాతీయ ఆంగ్ల వెబ్‌సైట్ రాసిన కథానాన్ని ట్వీట్ చేశారు.

    English summary
    AR Rahman tweeted about Sushant Singh Rajput's last movie Dil Bechara. He wrote that if Dil Bechara released in theatres, It would have collected 2000 crores. He quoted Hindustan times story in his tweet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X