Aranmanai Collections 100 కోట్ల వసూళ్లపై కన్నేసిన తమన్నా మూవీ.. ఇప్పటి వరకు కోట్ల కలెక్షన్లంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, గ్లామర్ డాల్ రాశీ ఖాన్నా ప్రధాన పాత్రల్లో నటించిన బాక్ (తమిళంలో అరణ్మనై 4) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత సుందర్ సీ రూపొందించారు. ఈ మూవీకి ప్రముఖ నటి కుష్బూ నిర్మాతగా వ్యవహరించారు. సుందర్ సీ నటించిన ఈ మూవీ గ్రాండ్‌గా మే 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.ఈ సినిమా కలెక్షన్లు ఎంత? బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
దుష్టశక్తుల కథతో ఎమోషనల్ థ్రిల్లర్‌గా, మదర్ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాను భారీగా వీఎఫ్ఎక్స్‌తో రూపొందించారు. ఈ సినిమాలో టాప్ ఆర్టిస్టులు,టాలెంటెడ్ టెక్నిషియన్స్‌ను ఉపయోగించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగానే అయింది. ఆర్టిస్టులు, టెక్నిషియన్స్, ప్రొడక్షన్స్ కాస్త్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా ఈ సినిమా బడ్జెట్ 60 కోట్ల మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

ఇక రెండో వారంలో కూడా తమిళంలో భారీగా, నిలకడగా వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం గత 12 రోజుల్లో మొత్తంగా 47 కోట్ల రూపాయలు నికరంగా, 51 కోట్ల గ్రాస్ రూపాయలను వసూలు చేసింది. ఇక తమిళంలో 50 కోట్ల మార్కు, అలాగే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల టార్గెట్‌పై దృష్టిపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.



Click it and Unblock the Notifications











