twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rana's Aranya collections: ఫస్ట్ డే టార్గెట్ ఎంతంటే.. బాక్సాఫీస్ వద్ద పరిస్థితి ఏంటంటే!

    |

    రానా దగ్గుబాటి నటించిన పాన్ ఇండియా మూవీ హాథీ మేరా సాథీ తెలుగులో అరణ్య టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రానా నటనపై సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రివ్యూ షోల తర్వాత ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉండవచ్చనే వివరాల్లోకి వెళితే..

    లాక్‌డౌన్ సమయంలో

    లాక్‌డౌన్ సమయంలో

    లాక్‌డౌన్‌కు ముందే అరణ్య చిత్రం రిలీజ్‌కు సిద్దమైంది. అనూహ్యంగా లాక్‌డౌన్ విధించడంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఆలోచన చేశారు. కానీ సినిమాకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా థియేటర్‌లోకి తీసుకురావాలని భావించారు.

    తెలుగు రాష్ట్రాల్లో 400 థియేటర్లలో

    తెలుగు రాష్ట్రాల్లో 400 థియేటర్లలో

    రానాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని అరణ్య మూవీని భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేశారు. నైజాంలో 126 థియేటర్లు, సీడెడ్‌లో 75, ఆంధ్రాలో 200 థియేటర్లలో విడుదలైంది. మొత్తంగా ఈ చిత్రం నైజాం, ఏపీలో 400కు పైగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    సురేష్ ప్రొడక్షన్స్ సొంతంగా

    సురేష్ ప్రొడక్షన్స్ సొంతంగా

    అరణ్య విషయానికి వస్తే ప్రీ రిలీజ్ బిజినెస్‌కు దూరంగా ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ సొంతంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. దాంతో బిజినెస్ పరంగా పెద్దగా టార్గెట్ లేవనే మాట వినిపిస్తున్నది. కాబట్టి భారీగా వసూళ్లు సాధిస్తే బడ్జెట్ మొత్తం నుంచి బయటపడే అవకాశం ఉంది.

    బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఎంతంటే

    బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఎంతంటే

    ఇక అర్యణ సినిమా దాదాపు 60 కోట్ల వ్యయంతో రూపొందినట్టు ట్రేడ్ వర్గాల రిపోర్టు. అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లు రాబట్టింది. ఈ క్రమంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో 26 కోట్లు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ సినిమా 26 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    అరణ్య తొలి రోజు కలెక్షన్ల అంచనా

    అరణ్య తొలి రోజు కలెక్షన్ల అంచనా


    ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం... ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉత్తరాదిలో సినిమా రిలీజ్ ఆగిపోయింది. తొలి రోజు మొదటి ఆట తర్వాత పరిశీలిస్తే ఈ సినిమాకు తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఓపెనింగ్స్ నమోదైనట్టు తెలుస్తున్నది. దీంతో ఈ సినిమా తొలి రోజున రూ. 4 కోట్లకు అటుఇటుగా కలెక్షన్లు రాబట్టే అవకాశం కనిపిస్తున్నదని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

    English summary
    As per Trade Report Rana Daggubati's Aranya movie Own Release in All Centers. Movie was Made With Whopping 60Cr Budget and 35cr~ Recovered from Non Theatrical Rights... now Movie Need another 26Cr~ from Theatrical Run...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X