Aranya Day 3 Collections: బాక్సాఫీస్ వద్ద రానా మూవీ తడబాటు.. లాభాల్లోకి రావాలంటే...

బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా రానా దగ్గుబాటి తాజాగా అరణ్య మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పర్యావరణం, జంతు సంరక్షణ అంశాల నేపథ్యంగా ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన మూవీలో రానా తన నటనతో ఆకట్టుకొన్నాడు. అయితే ఈ సినిమా వసూళ్లు బాక్సాఫీస్ వద్ద ఆశాజనకంగా లేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నది. అరణ్య మూవీ 3 రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...

భిన్న భంగిమలు.. నైనా గంగూలి అందాల విందు అదరహో

వారాంతంలో నిరాశజనకంగా కలెక్షన్లు

వారాంతంలో నిరాశజనకంగా కలెక్షన్లు

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరణ్య చిత్రం మూడో రోజున మోస్తారు కలెక్షన్లను మాత్రమే సాధించింది. సెలవు రోజున కూడా ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయింది. దాంతో బాక్సాఫీస్ వద్ద మూవీ కలెక్షన్లు పేలవంగా ఉన్నాయి. సినిమా వసూళ్లనకు లిట్మస్ టెస్ట్‌గా మారే సోమవారం కలెక్షన్లపైనే ఈ సినిమా రన్ ఆధారపడి ఉంటుంది.

బికినీ అందాలు.. ఔరా అనిపిస్తోన్న నైరా బెనర్జీ

అరణ్య మూడో రోజు వసూళ్లు

అరణ్య మూడో రోజు వసూళ్లు

అరణ్య చిత్రం మూడో రోజున నైజాంలో రూ.14 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ.7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ.3 లక్షలు, గుంటూరు జిల్లాలో రూ.5.4 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.5.8 లక్షలు, నెల్లూరులో రూ.2.2 లక్షలు వసూలు చేసింది.

పొట్టి బట్టల్లో రచ్చ.. ఆహానా కుమ్రా పిక్స్ వైరల్

అరణ్య 3 రోజుల మొత్తం రాబడి

అరణ్య 3 రోజుల మొత్తం రాబడి

ఇక మూడు రోజుల మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో రూ.84 లక్షలు, సీడెడ్‌లో రూ.37 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.40 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలోరూ.22 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ. 16 లక్షలు, గుంటూరు జిల్లాలో రూ.32 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.19 లక్షలు, నెల్లూరు జిల్లాలో రూ.10 లక్షలు వసూలు చేసింది.

వాలు చూపుతో వయ్యారాల విందు.. సమంత హాట్ పిక్స్ వైరల్

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రిపోర్టు

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రిపోర్టు

అరణ్య మూవీ గత మూడు రోజుల్లో ఏపీ, నైజాంలో కలిపి రూ.2.60 కోట్లు నికరంగా, రూ.4.10 కోట్లు స్థూలంగా వసూళ్లను రాబట్టింది. కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.1.32 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.18 లక్షలు సాధించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.4.10 కోట్లు నికరంగా, రూ.7 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది.

అరణ్య చిత్రం లాభాల్లోకి రావాలంటే..

అరణ్య చిత్రం లాభాల్లోకి రావాలంటే..

అరణ్య చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. లాభాల్లొకి రావాలంటే కనీసం ఇంకా రూ.11 కోట్లు కలెక్ట్ చేయాలి. అయితే రానున్న రోజుల్లో ఈ సినిమా వసూళ్లు ఏ రేంజ్‌లో పుంజుకొంటాయో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X