‘అరవింద సమేత’ 150 కోట్లు..... లాభాల్లోకి వెళ్లినట్లేనా? టాప్ 5లో చోటు దక్కాలంటే?

Recommended Video

‘అరవింద సమేత’ 150 కోట్లు..... లాభాల్లోకి వెళ్లినట్లేనా?

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' చిత్రం బాక్సాఫీసు వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళుతోంది. విజయవంతంగా సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకుని తాజాగా రూ. 150 కోట్లు(గ్రాస్) మార్కును క్రాస్ చేసింది.

ఎన్టీఆర్ కెరీర్లో రూ. 150 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించిన తొలి చిత్రం ఇదే. 2018లో విడుదలైన తెలుగు చిత్రాల్లో భారీ వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా రికార్డుల కెక్కింది. ఆల్ టైమ్ తెలుగు ఇండస్ట్రీ కలెక్షన్ రికార్డులను పరిశీలిస్తే.... ప్రస్తుతం 6వ స్థానంలో ఉంది.

ఫస్ట్ వీకెండ్ లోపే రూ. 100 కోట్లు

ఫస్ట్ వీకెండ్ లోపే రూ. 100 కోట్లు

అక్టోబర్ 11న విడుదలైన ఈ చిత్రం మొదటి ఆటనుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో సినిమా విడుదలైన ఫస్ట్ వీకెండ్ లోపే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది.

 సెకండ్ వీకెండ్ రూ. 151 కోట్లు

సెకండ్ వీకెండ్ రూ. 151 కోట్లు

వీక్ డేస్‌లో కలెక్షన్స్ కాస్త నెమ్మదించినా.... సెకండ్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి రూ. 151 కోట్ల మార్కును అధిగమించింది. తొలి 8 రోజుల్లో రూ. 135 కోట్లు వసూలు చేయగా, సెకండ్ వీకెండ్ రూ. 16 కోట్లు రాబట్టింది. దీంతో టోటల్ 11 డేస్ కలెక్షన్ రూ. 151 కోట్లకు చేరుకుంది.

మొత్తం పెట్టుబడి తిరిగొచ్చినట్లేనా?

మొత్తం పెట్టుబడి తిరిగొచ్చినట్లేనా?

అరవింద సమేత గ్లోబల్ థయేట్రికల్ రైట్స్ రూ. 91 కోట్లకు అమ్మారు. 11 రోజుల్లో రూ. 151 కోట్ల గ్రాస్ వసూలవ్వడం ద్వారా ఈ చిత్రం రూ. 91 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాకు డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చినట్లే అని అంటున్నారు. అయితే ఏరియాల వారీగా కాస్త హెచ్చు తగ్గులు ఉండొచ్చని అంటున్నారు.

ఏరియావైజ్ షేర్ వివరాలు

ఏరియావైజ్ షేర్ వివరాలు

ఏరియా వైజ్ షేర్ వివరాలు పరిశీలిస్తే... నైజాంలో రూ. 20.25 కోట్లు, సీడెడ్లో రూ. 15.82 కోట్లు, వైజాగ్‌లో రూ. 8.02 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.28 కోట్లు, వెస్ట్ లో రూ. 4.56 కోట్లు, కృష్ణలో రూ. 4.73 కోట్లు, గుంటూరులో 7.68 కోట్లు, నెల్లూరులో రూ. 2.40 కోట్లు, కర్నాటకలో రూ. 9.01 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 2.60 కోట్లు, ఓవర్సీస్ రూ. 13.12 కోట్లు.... టోటల్ రూ. 91.05 కోట్లు రాబట్టినట్లు సమాచారం.

లాభాల్లోకి వెళ్లినట్లేనా?

లాభాల్లోకి వెళ్లినట్లేనా?

నైజాం, సీడెడ్, గుంటూరు, కర్నాటకలో డిస్ట్రిబ్యూటర్ల పూర్తి పెట్టుబడి తిరిగి వచ్చేసి లాభాల్లోకి వెళ్లింది. ఇతర ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పాయింటుకు కొద్దిదూరంలో ఉంది. ఫుల్ రన్‌లో అన్ని ఏరియాల్లో లాభాలు ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

టాప్ 5లోకి వెళ్లాలంటే

టాప్ 5లోకి వెళ్లాలంటే

2018లో టాప్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాల్లో ‘అరవింద సమేత' 3వ స్థానంలో నిలిచింది. ఓవరల్‌గా ఆల్ టైమ్ రికార్డ్స్ పరిశీలిస్తే... మొదటి స్థానంలో బాహుబలి 2 ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో బాహుబలి, భరత్ అనే నేను, రంగస్థలం, ఖైదీ నెం. 150 చిత్రాలు మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ‘అరవింద సమేత' టాప్ 5కు చేరుకోవాలంటే టోటల్ గ్రాస్ రూ. 165 కోట్లకు రీచ్ అవ్వాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X