‘అరవింద సమేత’ 15 డేస్ కలెక్షన్: మెగాస్టార్ రికార్డుకు చేరువలో....

Recommended Video

Aravinda Sametha Veera Raghava 15 Days Collections

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'అరవింద సమేత' బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 2 వారాలు పూర్తి చేసుకుంది. సెకండ్ వీకెండ్ సమయానికే రూ. 150 కోట్ల మార్కను క్రాస్ చేసిన ఈ చిత్రం టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ గ్రాసర్ లిస్టులో టాప్ 5లో చోటు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ గ్రాసర్ లిస్టులో రూ. 164 కోట్ల వసూళ్లతో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం. 150' ఐదవ స్థానంలో ఉండగా... దాన్ని బద్దలు కొట్టే దిశగా ఎన్టీఆర్ చిత్రం దూసుకెళుతోంది.

ఇప్పటి వరకు వసూలైన మొత్తం ఎంత?

ఇప్పటి వరకు వసూలైన మొత్తం ఎంత?

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 15 రోజుల్లో ‘అరవింద సమేత' టోటల్ గ్రాస్ రూ. 158 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ రికార్డును అందుకోవడానికి మరో 6 కోట్టు వసలు చేస్తే సరిపోతుంది. థర్డ్ వీకెండ్ నాటికి ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన షేర్ ఎంత?

ఇప్పటి వరకు వచ్చిన షేర్ ఎంత?

‘అరవింద సమేత' వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 91 కోట్లకు అమ్మారు. ఇప్పటి వరకు వసూలైన రూ. 158 కోట్ల గ్రాస్ ద్వారా మొత్తం రూ. 95 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైంది. దీంతో అన్ని ఏరియాల్లో పెట్టుబడి వంద శాతం రికవరీ అయినట్లయింది.

ఎన్టీఆర్ కెరీర్లో టాప్

ఎన్టీఆర్ కెరీర్లో టాప్

కాగా... ‘అరవింద సమేత' చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే ఆల్ టైమ్ టాప్ గ్రాసర్‌గా నిలిచింది. అంతే కాకుండా రూ. 150 కోట్ల మార్కును అందుకున్న తొలి చిత్రం కూడా ఇదే. దర్శకుడు త్రివిక్రమ్ కెరీర్లో సైతం ఇదే బిగ్గెస్ట్ మూవీ.

టాలీవుడ్ టాప్ 5 మూవీస్

టాలీవుడ్ టాప్ 5 మూవీస్

టాలీవుడ్ టాప్ 5 గ్రాస్ సాధించిన లిస్టు తీసుకుంటే... బాహుబలి 2 మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో బాహుబలి, భరత్ అనే నేను, రంగస్థలం, ఖైదీ నెం.150 చిత్రాలు ఉన్నాయి. మరో 7 కోట్లు సాధిస్తే 5వ స్థానంలో ‘అరవింద సమేత' నిలిచే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X