twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ కలెక్షన్ల ప్రభంజనం.. తెలుగు రాష్ట్రాల్లో.. ఆస్ట్రేలియాలో అరవింద దూకుడు!

    |

    తెలుగు రాష్ట్రాల్లో అరవింద సమేత చిత్రం కలెక్షన్ల దూకుడు ప్రదర్శిస్తున్నది. తొలి రోజున రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది. పలు భారీ హీరోల చిత్రాల రికార్డులు అరవిందకు దాసోహం అన్నాయి. మొదటి ఆట నుంచే భారీ కలెక్షన్లు సాధిస్తూ నాన్ బాహుబలి క్యాటగిరిలో అతిపెద్ద విజయాన్ని అందుకొన్నది. బాహుబలి2 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

     తొలిరోజున వసూళ్లు

    తొలిరోజున వసూళ్లు

    ఎన్టీఆర్, పూజా హెగ్డే నటించిన అరవింద సమేత అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 1000కి పైగా థియేటర్లలో రిలీజైంది. తొలి రోజున అరవింద సమేత చిత్రం రూ.28.30 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ ఊపు ఇలానే కొనసాగితే ఇక వారాంతంలో కూడా మరిన్ని రికార్డులు తిరగరాసే అవకాశం లేకపోలేదు.

     మొదటి రోజే లాభాలకు చేరువలో

    మొదటి రోజే లాభాలకు చేరువలో

    తెలుగు రాష్ట్రాల్లో అరవింద సమేత థియేట్రికల్ రైట్స్‌ను రూ.70 కోట్లకు అమ్మడం జరిగింది. తొలిరోజునే ఈ చిత్రం రూ.28.30 కోట్లు వసూలు చేయడంతో పెట్టుబడిలో రూ.38.05 శాతం రాబడి వచ్చేసింది. ఇటీవల నష్టాల్లో మునిగిపోతున్న డిస్టిబ్యూటర్లకు అరవింద లాభాల్ని తెచ్చిపెట్టే విధంగా ముందుకెళ్తున్నది.

    అగ్ర హీరోల రికార్డులు బ్రేక్

    అగ్ర హీరోల రికార్డులు బ్రేక్

    పవన్ కల్యాణ్ నటించిన అజాతవాసి 26.36 కోట్లు, మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను రూ.21.74 కోట్లు, రాంచరణ్ నటించిన రంగస్థలం 19.49 కోట్లు, చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రం సాధించిన 22.40 కోట్ల తొలి రోజు వసూళ్లను అరవింద అధిగమించింది. రానున్న రోజుల్లో అరవింద వసూళ్లు సునామీలా ఉండవచ్చనే అభిప్రాయాన్ని ట్రేడ్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

    అమెరికాలో కలెక్షన్ల కుమ్ముడు

    అమెరికాలో కలెక్షన్ల కుమ్ముడు

    అమెరికాలో అరవింద సమేత కనక వర్షం కురిపిస్తున్నది. బుధవారం ప్రీమియర్ల ద్వారా $ 790,505 సాధించిన అరవింద సమేత.. గురువారం 196 లోకేషన్లలో 228115 డాలర్లను వసూలు చేసింది. రెండు రోజుల్లో 7.50 కోట్లు (: $ 1,018,620) వసూలు చేసింది.

     ఆస్ట్రేలియాలో అరవింద ప్రభంజనం

    ఆస్ట్రేలియాలో అరవింద ప్రభంజనం

    అదే విధంగా ఆస్ట్రేలియాలో కూడా ఎన్టీఆర్ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతున్నది. గురువారం 35 లోకేషన్లలో రూ.67.63 లక్షలు (A$ 128,740) వసూలు చేసింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో గురువారం కేవలం 3,678 అమెరికా డాలర్ల వసూళ్లు మాత్రమే నమోదయ్యాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా చార్ట్స్‌లో 9వ స్థానంలో నిలిచింది. ఇలా ఆస్ట్రేలియా చార్ట్‌లో తెలుగు చిత్రం నిలువడం ఓ అరుదైన రికార్డుగా చెప్పుకొంటున్నారు.

    English summary
    Aravinda Sametha has thrashed the collection records of Agnyaathavaasi, Bharat Ane Nenu, Rangasthalam at the box office on the first day and emerges as the biggest non-Baahubali opener in Andhra Pradesh/Telangana. It has registered superb collections at the box office on the first day. It has emerged as the biggest non-Baahubali opener.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X