twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అరవింద కలెక్షన్ల జోరు.. యూఎస్‌లో అరుదైన రికార్డు.. ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యెస్ట్!

    |

    Recommended Video

    Aravindha Sametha Movie US Box Office Collections!

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత.. వీర రాఘవ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అరుదైన రికార్డులు నెలకొల్పే దిశగా ఈ చిత్రం ముందుకెళ్తున్నది. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మండమైన రెస్సాన్స్ వస్తున్నది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

     ప్రీమియర్లకు రూ.5.85 కోట్లు

    ప్రీమియర్లకు రూ.5.85 కోట్లు

    అమెరికాలో అరవింద సమేత ప్రివ్యూలకు కలెక్షన్ల వర్షం కురిసింది. 218 లొకేషన్లలో ఈ చిత్రం రూ.5.85 కోట్లు (791021 డాలర్లు) సాధించింది. యూఎస్ అంతా అరవింద సమేత చిత్రం బ్రహ్మండంగా మొదలైంది. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్ష్ పేర్కొన్నారు.

     6వ మిలియన్ డాలర్ చిత్రం

    6వ మిలియన్ డాలర్ చిత్రం

    అరవింద సమేత చిత్రం తొలిరోజు ముగిసే సమయానికి 1 మిలియన్ డాలర్లను సొంతం చేసుకొన్నట్టు తెలిసింది. తారక్ కెరీర్‌లో ఇది 6వ మిలియన్ డాలర్ల చిత్రం. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వరుసగా ఐదు చిత్రాలు యూఎస్ 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరడం విశేషం. దమ్ము కూడా మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే

    యూఎస్‌లో అరుదైన రికార్డు

    యూఎస్‌లో అరుదైన రికార్డు

    అమెరికాలో అరవింద సమేత చిత్రం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. 218 సెంటర్లలో ఈ చిత్రం రూ.5.94 కోట్లు సంపాదించింది. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను 310 సెంటర్లలో రూ.5.61 కోట్లు వసూలు చేయడం గమనార్హం.

    నైజాంలో కలెక్షన్ల జోరు

    నైజాంలో కలెక్షన్ల జోరు

    నైజాంలో అరవింద సమేత చిత్రం భారీ కలెక్షన్లను సాధించినట్టు దిల్ రాజు వెల్లడించారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అరవింద సమేత ఓ కొత్త రికార్డును సొంతం చేసుకొంది. త్వరలోనే కలెక్షన్ల వివరాలు తెలియజేస్తామని దిల్ రాజు పేర్కొన్నారు. అనధికార సమాచారం ప్రకారం తొలి రోజున రూ.3.8 కోట్లు వసూలు చేసినట్టు తెలిసింది.

    ఆంధ్రా, సీడెడ్‌లో నాన్ బాహుబలి..

    ఆంధ్రా, సీడెడ్‌లో నాన్ బాహుబలి..

    ఇక ఆంధ్రా, సీడెడ్ జిల్లాల్లో కూడా అరవింద సమేత చిత్రం కలెక్షన్ల కుంభవృష్టి కురుస్తున్నది. కృష్ణా జిల్లాలో ఈ చిత్రం తొలిరోజున ₹2,08,64,056/- కోట్లు సంపాదించింది. నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్‌గా నిలిచింది.

    రికార్డు ధరకు శాటిలైట్ హక్కులు

    రికార్డు ధరకు శాటిలైట్ హక్కులు

    ఇక అరవింద సమేత చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. ఈ చిత్రాన్ని 23.50 కోట్లు చెల్లించి జీ తెలుగు హక్కులను దక్కించుకొన్నది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే హయ్యెస్ట్.

    English summary
    NTR, Trivikram Srinivas's Aravinda sametha has sky high expections. This movie teaser, First Look got good response from fans. Now Aravinda Sametha juke box came out into the market. Four songs have good lyrical values. This movie set to release on October 11th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X