చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.... రూ.100 కోట్ల క్లబ్‌లో ‘అరవింద సమేత’
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేస్తోంది. అక్టోబర్ 11న విడుదలైన ఈ చిత్రానికి తొలి ఆట నుండే పాజిటివ్ టాక్ రావడం, రెస్పాన్స్ అదిరిపోయే విధంగా ఉండటంతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కొన్ని ఏరియాలో ఈ చిత్రం బాహుబలి రికార్డులను సైతం అధిగమించడం ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్చ పరుస్తోంది. తాజాగా 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం రూ. 100 కోట్ల (గ్రాస్) మార్కును అందుకుంది.

మొండికత్తి దెబ్బకు బాక్సాఫీసు బద్దలు
‘అరవింద సమేత'లో వీర రాఘవ రెడ్డి పాత్రలో ఎన్టీఆర్ మొండి కత్తితో చేసే యుద్ధం సినిమా మొత్తానికే హైలెట్ అయింది. దీంతో పాటు మొండికత్తి కథతో సినిమాలో అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షులను మెప్పించాడు దర్శకుడు త్రివిక్రమ్. అలా ఎన్టీఆర్ కత్తి పవర్, త్రివిక్రమ్ పెన్ పవర్ వెరసి..... సినిమా విడుదలైన 4వ రోజు రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ చిత్రబృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్
బాహుబలి తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘అరవింద సమేత' ఇప్పటికే చరిత్ర సృష్టించింది. వారంలోపే ఈ మూవీ డిస్టిబ్యూటర్ షేర్ రూ. 100 కోట్లను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శిస్తుండటం, సినిమాకు రెస్పాన్స్ అద్భుతంగా ఉండటంతో రూ. 100 కోట్ల పై చిలుకు షేర్ సాధ్యమే అంటున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన షేర్ ఎంత?
ఇప్పటి వరకు రూ. 50 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైనట్లు తెలుస్తోంది. . హాలిడే సీజన్ కావడంతో థియేటర్లు అత్యధిక ఆక్సుపెన్సీ సాధిస్తున్నాయి. మరో వారం పాటు దసరా హాలిడే సీజన్ ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు లాభాలు పొందడం ఖాయం అని తేలిపయింది.

లాభాల్లోకి రావాలంటే ఇంకా ఎంత?
‘అరవింద సమేత' మూవీ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ వరల్డ్ వైడ్ అన్ని ఏరియాలు కలిపి రూ. 92 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పటికే రూ. 50 కోట్లకు షేర్ రావడంతో మరో రూ. 42 కోట్లు సాధించడం అంత కష్టం ఏమీ కాదని అంటున్నారు.

డిఫరెంటుగా ట్రై చేసి సక్సెస్ అయ్యారు
సాధారణంగా ఫ్యాక్షన్ సినిమాలన్నీ యుద్ధంతో ముగుస్తాయి. అయితే అరవింద సమతే అందుకు భిన్నంగా... ‘యుద్ధం తర్వాత జరిగే పరిణామాలను ఫోకస్ చేస్తూ శాంతిని నెలకొల్పేందుకు హీరో ఏం చేశాడు' అనే కోణంలో చూపించాడు. దర్శకుడు చెప్పిన పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం, ఎన్టీఆర్ కూడా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.


Click it and Unblock the Notifications











