నెం.1 స్థానంలో ‘అరవింద సమేత’... అన్ని కార్డులు బద్దలు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. ఎన్టీఆర్ కెరీర్లో ఉన్నటి వరకు వచ్చిన సినిమాల రికార్డులన్నింటినీ కేవలం 8 రోజుల్లో బద్దలు కొట్టేసి నెం.1 స్థానం దక్కించుకుంది. దీంతో పాటు త్రివిక్రమ్ కెరీర్లో సైతం హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇప్పటి వరకు ఎన్టీఆర్ కెరీర్లో 'జై లవ కుశ', 'జనతా గ్యారేజ్' చిత్రాలు హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాలుగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాల లైఫ్ టైమ్ గ్రాస్ రికార్డులను 'అరవింద సమేత' అధిగమించి టాప్ పొజిషన్ దక్కించుకుంది.

ఫస్ట్ వీకెండ్ నుంచే రికార్డులు
‘అరవింద సమేత' చిత్రం ఫస్ట్ వీకెండ్ నుంచే రికార్డుల మోత ప్రారంభించింది. తొలి 4 రోజుల్లోనే రూ. 111.80 కోట్లకుపైగా వసూలు చేసి ఈ ఏడాది విడుదలైన రంగస్థలం, భరత్ అనే నేను రికార్డులను అధిగమించి ఫస్ట్ వీకెండ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

ఇప్పటి వరకు వచ్చిన టోటల్ గ్రాస్
తొలి వారాంతం తర్వాత ‘అరవింద సమేత' జోరు కాస్త తగ్గింది. ఫస్ట్ వీకెండ్ 4 రోజుల్లో రూ. 11.80 కోట్లు వసూలు చేయగా, మిగిలిన నాలుగు వీక్ డేస్‌లో రూ. 23.20 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో టోటల్ 8 డేస్ గ్రాస్ రూ. 135 కోట్లకు చేరుకుంది.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ గత రికార్డులు బద్దలు
ఎన్టీఆర్ గత చిత్రాలైన ‘జై లవ కుశ' లైఫ్ టైమ్ కలెక్షన్ రూ. 131 కోట్లు కాగా... జనతా గ్యారేజ్ రూ. 134 కోట్లు రాబట్టింది. ఈ రెండు చిత్రాలను ‘అరవింద సమేత' కేవలం 8 రోజుల్లోనే అధిగమించింది. ఇక త్రివిక్రమ్ గత సినిమా కంటే హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా ‘అరవింద సమేత' నిలిచింది.

లాభాలు రావాలంటే..
‘అరవింద సమేత' వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 92 కోట్లు అమ్మారు. డిస్ట్రిబ్యూటర్స్ లాభ పడాలంటే రూ. 93 కోట్ల షేర్ వసూలవ్వాలి. అయితే ఇప్పటి వరకు రూ. 81 కోట్లు షేర్ వచ్చినట్లు సమాచారం. లాభాలు రావాలంటే ఈ చిత్రం మరో 15 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











