ఎన్టీఆర్ బాక్సాఫీస్‌ను షేక్ ఖాయమట.. సొంత రికార్డులు ఫట్టా? ఆ ముగ్గురిపై కన్నేసిన...

Recommended Video

Will Aravinda Sametha Break Rangasthalam Collections...?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత చిత్రం పాజిటివ్ టాక్‌తో మొదలైంది. తొలి ఆట నుంచే ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. పాజిటివ్ టాక్‌తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఆంధ్ర, తెలంగాణ, ఓవర్సీస్‌లో అడ్వాన్సు బుకింగ్‌కు మంచి స్పందన వస్తున్నది. దీంతో ఎన్టీఆర్ రికార్డు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే

అంతా సానుకూలమే

అంతా సానుకూలమే

అరవింద సమేతకు అన్నీ సానుకూల అంశాలే కనిపిస్తున్నాయి. భారీ సినిమాలు లేకపోవడం, వచ్చే రోజులన్నీ హాలీడేస్ కావడం సినిమాకు శుభపరిణామం. పండుగ నేపథ్యంలో ప్రేక్షకుల తాకిడి ఎక్కువగానే ఉండవచ్చని తెలుస్తున్నది. దీంతో ఎన్టీఆర్ కలెక్షన్ల రికార్డులు మెరుగయ్యే అవకాశం కనిపిస్తున్నది.

 భారీ సంఖ్యలో విడుదల

భారీ సంఖ్యలో విడుదల

అరవింత సమేత చిత్రం తొలి రోజున రూ.55 నుంచి 60 కోట్ల మధ్య కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌లో భారీగానే అంటే సుమారు 225 స్క్రీన్లలో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. పిల్లలకు 15 డాలర్లు, పెద్దలకు 20 డాలర్ల చొప్పున టికెట్ రేట్‌ను పెట్టడం భారీ కలెక్షన్లకు మార్గం సుగమం కావొచ్చు.

 ఆ ముగ్గురిపై కన్నేసిన ఎన్టీఆర్

ఆ ముగ్గురిపై కన్నేసిన ఎన్టీఆర్

ఇప్పటి వరకు తొలిరోజు కలెక్షన్లలో మహేష్ బాబు, రాంచరణ్ తేజ్, పవన్ కల్యాన్ ముందున్నారు. తొలి రోజున అజాతవాసి రూ.60.50 కోట్లు, భరత్ అనే నేను రూ.53.80, రంగస్థలం రూ.43.80 కోట్లు వసూలు చేశాయి. అరవింద సమేతతో ఎన్టీఆర్ ఆ భారీ రికార్డులపై కన్నేశాడు. వ్యక్తిగత వసూళ్ల ట్రాక్ రికార్డును మెరుగు చేసుకొనే అవకాశం ఉంది.

సొంత రికార్డులు కనుమరుగయ్యేనా

సొంత రికార్డులు కనుమరుగయ్యేనా

ఇప్పటి వరకు ఎన్టీఆర్ కెరీర్‌లో జై లవకుశ చిత్రం మొదటి రోజు కలెక్షన్ల విషయంలో ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత మోగించింది. ఎన్టీఆర్ కెరీర్‌లో మునుపెన్నడూ లేని విధంగా తొలిరోజే రూ.45.60 కోట్ల వసూళ్లను రాబట్టింది. జనతా గ్యారేజ్ స్థాపించిన రూ.41 కోట్ల రికార్డును బద్దలుకొట్టింది. అయితే ఈ సినిమా ఈ రెండు రికార్డులను తుడిచిపెట్టడం ఖాయమంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X