రూ. 150 కోట్ల వైపు ‘అరవింద సమేత’.... ‘రంగస్థలం, భరత్ అనే నేను’ వెనక్కి!

Recommended Video

Trivikram Speech @Aravindha Sametha Success Press Meet

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' బాక్సాఫీసు వద్ద వసూళ్ల ప్రభంజనం క్రియేట్ చేస్తోంది. నిన్నమొన్నటి వరకు నాన్ బాహుబలి కేటగిరీలో 'రంగస్థలం', 'భరత్ అనే నేను' చిత్రాలు టాప్ పొజిషన్లో ఉండేవి. అయితే 'అరవింద సమేత' విడుదల తర్వాత ఈ రెండు చిత్రాలు వెనకబడి పోయాయి. ఇప్పటికే ఓపెనింగ్స్ పరంగా, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ మూవీ టాప్ పొజిషన్ దక్కించుకుంది. కేవలం వసూళ్ల పరంగానే కాదు... రేటింగ్స్ పరంగా కూడా ఈ చిత్రం రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలను వెనక్కి నెట్టేసింది.

ఇంటర్నేషనల్ రేటింగ్స్ పరంగా కూడా

ఇంటర్నేషనల్ రేటింగ్స్ పరంగా కూడా

ఇంటర్నేషనల్ మూవీ డాటా బేస్(ఐఎండిబి)లో కూడా ‘అరవింద సమేత' హయ్యెస్ట్ రేటింగ్ సాధించింది. ‘అరవింద సమేతక'కు 8.9/10 రేటింగ్ దక్కింది. రంగస్థలం 8.7/10, భరత్ అనే నేను 8.3/10 రేటింగుతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.

 తొలి రోజు నుండే సంచలనాలు

తొలి రోజు నుండే సంచలనాలు

‘అరవింద సమేత' చిత్రం ఓపెనింగ్ డే నుండే సంచలనాలు మొదలు పెట్టింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 2వేలకు పూగా స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలను వెనక్కి నెట్టి 2018లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

 మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు

మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు

ఫస్ట్ వీకెండ్ రికార్డుల విషయానికొస్తే భరత్ అనే నేను, రంగస్థలం కంటే వేగంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి ‘అరవింద సమేత' చరిత్ర సృష్టించింది. దసరా హాలిడే సీజన్ కావడంతో ఈ చిత్రం ఫుల్ రన్‌లో భారీ వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏ మూవీ లేదు రూ. 200 కోట్ల వైపు పరుగులు, సాధ్యమేనా?

ఏ మూవీ లేదు రూ. 200 కోట్ల వైపు పరుగులు, సాధ్యమేనా?

ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో బాహుబలి తప్ప రూ. 200 కోట్లను అందుకున్న సినిమా లేదు. మరి నాన్ బాహుబలి కేటగిరీలో ‘అరవింద సమేత' ఆ ఘనత సాదిస్తుందా? అనేది హాట్ టాపిక్ అయింది. వారం రోజులు దసరా హాలిడే సీజన్ ఉండటంతో రూ. 150 కోట్ల ఖాయం అని తేలిపోయింది. అదే సమయంలో రూ. 200 కోట్ల మార్కు సాధ్యం కావొచ్చనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X