‘రంగస్థలం’ రికార్డ్ బద్దలు కొట్టిన ‘అరవింద సమేత’... టాప్ 7
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' రికార్డుల వేట మొదలు పెట్టింది. యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్లతో ఈ చిత్రం తన రికార్డుల ఖాతా ఓపెన్ చేసింది. 'రంగస్థలం' సినిమా రికార్డును అధిగమించింది.
యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడం, త్రివిక్రమ్ దర్శకత్వం వహించడంతో 'అరవింద సమేత' పై ముందు నుంచీ భారీ అంచనాలున్నాయి. దీంతో యూఎస్ఏ రైట్స్ దక్కించుకోవడానికి పలు సంస్థలు పోటీ పడ్డాయి. చివరగా వైనవి హన్వి క్రియేషన్స్ వారు రూ. 12.50 కోట్లకు ఇంటర్నేషనల్ రైట్స్ దక్కించుకున్నారు.
యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్స్
వైనవి హన్వి క్రియేషన్స్ వారు యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. అమెరికా కాలమాం ప్రకారం బుధవారం రాత్రి 11.25 గంటల వరకు 195 లొకేషన్ల నుంచి $730769 వసూలైంది.

225 థియేటర్లలో ప్రిమియర్ షో
వైనవి హన్వి క్రియేషన్స్ వారు ‘అరవింద సమేత' చిత్రాన్ని 225 థియేటర్లలో ప్రీమియర్ షోలు వేశారు. ఇప్పటి వరకు 195 లొకేషన్స్ నుంచి వివరాలు అందాయి. ఇంకా 30 లొకేషన్లకు సంబంధించి వివరాలు అందాల్సి ఉంది. అన్ని చోట్లా కలిపి $750K వసూలయ్యే అవకాశం ఉంది.

రంగస్థలం రికార్డ్ బద్దలు
కాగా, ప్రీమియర్ షో కలెక్షన్స్ విషయంలో ‘అరవింద సమేత'..... రంగస్థలం రికార్డులను బద్దలు కొట్టింది. రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం $707,000 వసూలు చేయగా ‘అరవింద సమతే' $730769 వసూలు చేసింది.

ఎన్టీఆర్‌కు ఇదే టాప్, త్రివిక్రమ్‌కు సెకండ్ బిగ్గెస్ట్
ప్రీమియర్ షో కలెక్షన్ల విషయంలో ఎన్టీఆర్ కెరీర్లో ఇదే టాప్ మూవీ. అయితే దర్శకుడు త్రివిక్రమ్‌కు ఇది సెకండ్ బిగ్గెస్ట్ మూవీ. ఆయన గత చిత్రం అజ్ఞాతవాసి ప్రీమియర్ షోల ద్వారా $1.51 మిలియన్ వసూలు చేసింది. ఎన్టీఆర్ గత చిత్రాలు జై లవకుశ $589,219, జనతా గ్యారేజ్ $584,000 ప్రీమియర్ షోల ద్వారా వసూలు చేశాయి.

టాప్-10 లిస్ట్
ప్రీమియర్ షో కలెక్షన్ల విషయంలో అరవింద సమేత 7వ స్థానం దక్కించుకుంది. నెం.1 స్థానంలో బాహుబలి 2 ఉండగా ఆ తర్వాత స్థానాల్లో అజ్ఞాతవాసి, బాహుబలి 1, ఖైదీ నెం. 150, స్పైడర్, భరత్ అనే నేను, అరవింద సమేత, రంగస్థలం, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవ కుశ చిత్రాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











