అద్దె డబ్బు కూడా రాలేదు... ‘అరవింద సమేత’ అక్కడ ఎందుకిలా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఫస్ట్ వీకెండ్ రూ. 100 కోట్లకుపైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. దసరా హాలిడేస్ కావడంతో ఈ చిత్రం వీక్ డేస్‌లో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది.
అయితే తెలుగు సినిమా కలెక్షన్లకు నైజాం ఏరియాలో పెట్టింది పేరైనా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓ థియేటర్లో 'అరవింద సమేత' సినిమా వసూళ్లు దారుణంగా ఉన్నాయి. ఈ ఏరియాలో 'అరవింద సమేత' చిత్రం మెయిన్ థియేటర్ సుదర్శన్‌తో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్స్ సర్కిల్‌లోకి వచ్చే 'తారకరామ'లో ప్రదర్శిస్తున్నారు.

తారకరామలో వసూళ్లు దారుణంగా
6వ రోజు కలెక్షన్స్ విషయానికొస్తే... సుదర్శన్ థియేటర్లో మూడున్నర లక్షలకుపైగా వసూలు చేయగా, తారకరామ థియేటర్లో కలెక్షన్స్ చాలా దారుణంగా ఉంది. కేవలం రూ. 54 వేలు మాత్రమే వసూలు చేసింది.

థియేటర్ అద్దె కూడా వెళ్లలేదు
తారకరామ థియేటర్ అద్దె రోజుకు రూ. 60 వేల వరకు ఉంటుందని, రూ. 54 వేలు మాత్రమే వసూలు కావడంతో 6వ రోజు కనీసం అద్దె డబ్బులు కూడా రాలేదని అంటున్నారు. రెండో రోజు నుండే ఇక్కడ కలెక్షన్స్ వీక్ ఉన్నాయి.

కారణం ఏమిటి?
అయితే ఈ థియేటర్లో వసూళ్లు తగ్గడానికి కారణం..... ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సర్కిల్ థియేటర్ అని చెబుతున్నప్పటికీ ఇది ఆ ప్రాంతానికి దూరంగా కాచిగూడ ప్రాంతంలో ఉంటమే. దీనికి తోడు తారకరామను ఆనుకుని పక్కనే ఐనాక్స్ మల్టీప్లెక్స్ ఉండటంతో ఈ ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా అటు వైపే మొగ్గు చూపుతున్నారట.
Recommended Video


కొందరు బి,సి సెంటర్స్
తారకరామ థియేటర్లో బాల్కనీ టికెట్ కాస్ట్ రూ. 100కు తక్కవ లేదు. పక్కనే ఐనాక్స్ ఉండటంతో రూ. 150 పెట్టి అటు వైపు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇదే ప్రాంతంలో రూ. 40 నుండి రూ. 80 రేంజిలో బి,సి కేటగిరీ థియేటర్లు ఉండటంతో రూ. 100 టిక్కెట్ కొనుగోలు చేయలేని వారు బి,సి కేటగిరీ థియేటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తారకరామ థియేటర్లో వసూళ్లు తగ్గడానికి ప్రదాన కారణం అదే అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











