రిస్క్ చేశాం, క్లైమాక్స్ మార్చేశాం: ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్లో త్రివిక్రమ్!

Recommended Video

Aravinda Sametha Movie Success Meet | అరవింద సమేత సినిమా సక్సెస్స్ మీట్ | Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో దర్శకుడు త్రివిక్రమ్‌, చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, నటులు సునీల్, నవీన్ చంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ... అన్ని ఏరియాల నుండి ఫీడ్ బ్యాక్ చాలా బావుందని, ఓపెనింగ్స్ వైజ్'గా ఎన్టీఆర్ కోరీర్లో హయ్యెస్ట్ గ్రాస్ సాధిస్తుందని తెలిపారు. దసరా సీజన్లో ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో ఇప్పుడే చెప్పలేం... వెయిట్ అండ్ సీ అన్నారు.

త్రివిక్రమ్ మాయ చేశారు

త్రివిక్రమ్ మాయ చేశారు

త్రివిక్రమ్ చాలా మాయ చేశాడు. ఫ్యాక్షన్ సినిమాలు అంటే మనకు ఒక ఇంద్ర, ఆది, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు ఇలా చాలా సినిమాలు చూశాం. కానీ ఒక ఫ్యాక్షన్‌ను సెటిల్డ్‌గా ఎంతో అందంగా చూపించాలో అంత అందంగా క్రియేట్ చేశాడు... అని దిల్ రాజు తెలిపారు.

యంగ్ టైగర్ వన్ మెన్‌ షో

యంగ్ టైగర్ వన్ మెన్‌ షో

‘అరవింద సమేత'లో ఎన్టీఆర్ వన్ మెన్ షో... జగపతి బాబు గారు చాలా బాగా చేశారు. ఇండస్ట్రీకి, తెలుగు సినిమాకు ఒక మంచి సినిమా అందించిందనుకు త్రివిక్రమ్ కు ధన్యవాదములు.... అని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

 ఎన్టీఆర్ మా అందరికంటే ఎక్కువ నమ్మాడు: త్రివిక్రమ్

ఎన్టీఆర్ మా అందరికంటే ఎక్కువ నమ్మాడు: త్రివిక్రమ్

సాధారణంగా నేను సినిమా హిట్ అయిందని అంత త్వరగా నమ్మను. కానీ ‘అరవింద సమేత' విషయంలో గంటలు గడుస్తున్న కొద్దీ వినిపిస్తున్న టాక్ తర్వాత ఆ నమ్మకం పెరిగింది. ఈ సినిమా కథను ఎన్టీఆర్ మా అందరి కంటే ఎక్కువ నమ్మాడు. ఒక్కోసారి మేము సాంగులు లేవు, మీ నుండి ఆడియన్స్ కోరుకునే స్టెప్పులేమైనా తగ్గుతున్నాయా? ఎంటర్టెన్మెంట్ ఏమైనా తగ్గిందా? అని మదన పడుతుండే... ఎన్టీఆర్ అవేవీ పట్టించుకోవద్దు అని ధైర్యం చెప్పారు. అందుకే ఆయనకు ఫస్ట్ థాంక్స్ చెప్పాలి.... అని త్రివిక్రమ్ వ్యాఖ్యానించారు.

జెన్యూన్‌గా చేసిన ప్రయత్నం ఫలించింది: త్రివిక్రమ్

జెన్యూన్‌గా చేసిన ప్రయత్నం ఫలించింది: త్రివిక్రమ్

హిట్ అనేది ఆనందాన్ని ఇస్తుంది. మళ్లీ నెక్ట్స్ మూవీ మొదలు పెట్టే సమయానికి ప్రెషర్ పెరుగుతుంది. ఇది సహజం. జెన్యూన్‌గా కథ చెప్పాలి. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చెప్పే ప్రయత్నం చేశాం. లాస్ట్ 1, 2 ఇయర్ నుండి నేను చూస్తున్నాను. ప్రజల్లో, మీడియాల్లో ఇండస్ట్రీలో మళ్లీ మనం ఇదివరకు చెప్పినట్లుగా మళ్లీ తెలుగు సినిమాకు గోల్డెన్ ఎరా వచ్చింది. 1950, 60ల్లో కథలను ఎలా నమ్మి చెప్పేవారమో... మనం మళ్లీ మొదలు పెట్టాం. చాలా సినిమాల బాగా ఆడి ప్రూవ్ చేశాయి కూడా... అని త్రివిక్రమ్ వ్యాఖ్యానించారు.

 ఈ సినిమా బేసిక్ పాయింట్ అదే

ఈ సినిమా బేసిక్ పాయింట్ అదే

మేము ముందు నుండీ ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఉన్నాం. బావుంది అంటే చాలు అనే ఉద్దేశ్యంలోనే ఉన్నాం. ఈ సినిమా బేసిక్ పాయింట్.... యుద్ధం తర్వాత ఎలా ఉంటుందో చూపించడమే. సాధారణంగా అయితే యుద్ధం చివర్లో పెడతారు. ఆ యుద్ధం మొదలయ్యే వరకు టెంపో క్రియేట్ చేయొచ్చు అని, యుద్ధంతో పూర్తి చేయవచ్చు అని నమ్ముతారు. కానీ మేము డిఫరెంటుగా చేశామని త్రివిక్రమ్ తెలిపారు.

 రిస్క్ చేశాం

రిస్క్ చేశాం

కథ చివరకు యుద్ధం కాకుండా.... దాని తర్వాత ఏం కథ ఉంటుంది అనే ఐడియా మమ్మల్ని చాలా ఎగ్జైట్ చేసింది. జనం అందరికీ అది నచ్చడం గొప్ప విషయం. ఈ విషయంలో రిస్క్ తీసుకున్నాం. దానికి ఎన్టీఆర్ ఒప్పుకోవడం వల్లనే ఈ సినిమా సాధ్యమైంది. కథ విన్నరోజు నుండి ఎన్టీఆర్ ఎవరెన్ని అనుమనాలు వ్యక్తం చేసినా వెనక్కి తగ్గలేదు... అని త్రివిక్రమ్ అన్నారు.

క్లైమాక్స్ మార్చేశాం

క్లైమాక్స్ మార్చేశాం

యాక్షన్ సీక్వెన్స్ క్రెడిట్ అంతా రామ్ లక్ష్మణ్ మాస్టర్లదే. వాస్తవంగా చెప్పాలంటే మేము ముందు ఒక యాక్షన్ క్లైమాక్స్ అనుకున్నాం. దాన్ని డిజైన్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత కూర్చుని అంతా డిస్క్రషన్స్ చేసినపుడు... క్లైమాక్స్‌లో యుద్ధం వద్దు అని చెప్పింది ఫైట్ మాస్టర్సే. చివర్లో ఫైట్ కంటే కూడా వెర్బల్‌గా వెళ్లడమే దీనికి కరెక్టుగా ఉంటుందని చెప్పారు. ఇతర టెక్నీషియన్లకు కూడా ఇది నచ్చడంతో క్లైమాక్స్ మార్చేశాం.... అని త్రివిక్రమ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X