దద్దరిల్లుతున్న బాక్సాఫీస్: ‘అరవింద సమేత’ యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' చిత్రం బాక్సాఫీసు సంచలనాల నమోదు చేయడం మొదలు పెట్టింది. ఇక్కడ థియేటర్లలో మొదటి ఆట పడటానికి ముందే యూఎస్ఏలో ప్రీమియర్ షోలు, ఏపీ, తెలంగాణల్లో తెల్లవారు ఝామునే బెనిఫిట్ షోలు ప్రదర్శించడ్డాయి. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అమెరికా నుండి తెలుగు రాష్ట్రాల వరకు బాక్సాఫీసు దద్దరిల్లిపోవడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video

ఎన్టీఆర్ ఫాలోయింగ్‌తో పాటు, త్రివిక్రమ్ సినిమాలకు అమెరికాలో మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌కు తగిన విధంగానే 200లకు పైగా ప్రీమియర్ షోలు వేశారు. తాజాగా యూఎస్ఏ ప్రీమియర్ షోలకు సంబంధించిన కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి.

195 లొకేషన్ల సమాచారం
యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వైనవి హన్వి క్రియేషన్స్ వారు యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. అమెరికా కాలమాం ప్రకారం బుధవారం రాత్రి 11.25 గంటల వరకు 195 లొకేషన్ల నుంచి $730769 వసూలైంది.

1 మిలియన్ ఖాయం
ఇప్పటి వరకు అందిన వివరాలను బట్టి సినిమా కేవలం ప్రీమియర్ షోలతోనే 1 మిలియన్ మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఫస్ట్ డే ముగిసిన తర్వాత కూడా సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ ఉంటే వసూళ్లు భారీగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో రూ. 100 కోట్లు టార్గెట్
తెలుగు రాష్ట్రాల్లో ‘అరవింద సమేత' చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు. దసరా హాలిడే సీజన్ కూడా కావడంతో సినిమాకు రెస్పాన్స్ అదిరిపోవడం ఖాయం. సినిమాపై పాజిటివ్ టాక్ స్పెడ్ అవుతున్న నేపథ్యంలో రూ. 100 కోట్లపైనే వసూలవ్వడం ఖాయం అంటున్నారు.

భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్
ఓవరాల్‌గా నైజాం, ఏపీ మొత్తం కలిపి రూ.70 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే అన్ని ఏరియాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ రూ.92 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది.


Click it and Unblock the Notifications











