అరవింద సమేత 4 రోజుల కలెక్షన్స్.. జైలవకుశ రికార్డు బ్రేక్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సరైన విజయం పడితే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు ఎలా ఉంటాయో అరవింద సమేత చిత్రం నిరూపించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో రూపొందిన ఈ చిత్రం అద్భుత విజయం దిశగా దూసుకుపోతోంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. చిత్రంలో కాస్త ఎంటర్ టైన్మెంట్ తగ్గినా త్రివిక్రమ్ రూపొందించిన ఎమోషనల్ సీన్స్ కు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉండగా అరవింద సమేత చిత్ర 4 రోజుల వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.

ఎన్టీఆర్ నటనకు ప్రశంసలు
త్రివిక్రమ్ మాటలు, దర్శత్వం ఒక ఎత్తైతే.. ఎన్టీఆర్ నటన ఎత్తు. ఎన్టీఆర్ కు ఆడియన్స్ లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. అందుకు తగ్గట్లుగానే అరవింద సమేత చిత్రంలో మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంతకు మించిన ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఆడియన్స్ నుంచి అద్భుత స్పందన వస్తుండడంతో చిత్రం విజయపథంలో దూసుకుపోతోంది.

జైలవకుశ రికార్డ్ బ్రేక్
తొలిరోజు వసూళ్ల పరంగా నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసిన అరవింద సమేత చిత్రం వీకెండ్ మొత్తం దూకుడు కొనసాగించింది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగురోజుల్లో ఈ చిత్రం 65 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం విశేషం. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన రికార్డ్ తానే అధికమించాడు. జైలవకుశ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో 52 కోట్లు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో దూకుడు
రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవింద సమేత ఫస్ట్ వీకెండ్ షేర్ 46 కోట్లకు చేరింది. వీకెండ్ మొత్తం అరవింద సమేత వసూళ్లు బలంగా కొనసాగాయి. వీక్ డేస్ లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే త్వరలో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

ఏరియాలవారీగా
అరవింద సమేత చిత్రం అనుకున్న విధంగానే నైజాం ఏరియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఫస్ట్ వీకెండ్ లో 13.82 కోట్ల షేర్ రాబట్టింది. నైజాం ఏరియాలో 19 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన సంగతి తెలిసిందే. సీడెడ్ లో 9 కోట్ల షేర్, వైజాగ్ లో 5.5 కోట్ల షేర్ రాబట్టింది. గుంటూరులో 7 కోట్లవరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరగగా ఇప్పటికే 6.10 కోట్లు రాబట్టడం విశేషం.

రెండు మిలియన్లకు చేరువలో
సాధారణంగానే త్రివిక్రమ్ చిత్రాలకు ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే అరవింద సమేత చిత్రం దూసుకుపోతోంది. శనివారం ముగిసే సమయానికి అక్కడ 1.8 మిలియన్ డాలర్లు వసూలు చేసిన అరవింద సమేత చిత్రం 2 మిలియన్ల దిశగా దూసుకుపోతోంది.


Click it and Unblock the Notifications











