twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ దెబ్బకు చిన్నదైపోయిన టార్గెట్.. అరవింద సమేత 5 రోజుల వసూళ్లు!

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రూపొందించిన దర్శత్వంలో రూపొందిన ఈ చిత్రానికి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాక్షన్, ఎమోషన్ ఎలాంటి సన్నివేశంలో అయినా ఎన్టీఆర్ అదరగొట్టేశాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తొలి రోజు నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రం 5వ రోజు కూడా జోరు కొనసాగించింది.

    అరవింద సమేత 4 రోజుల కలెక్షన్స్.. జైలవకుశ రికార్డు బ్రేక్!అరవింద సమేత 4 రోజుల కలెక్షన్స్.. జైలవకుశ రికార్డు బ్రేక్!

    100 కోట్ల గ్రాస్

    100 కోట్ల గ్రాస్

    అరవింద సమేత చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ తో దూసుకుపోతోంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందించిన కథ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. నాలుగురోజుల ఫస్ట్ వీకెండ్ లో అరవింద సమేత చిత్రం 65 కోట్లకు పైగా షేర్ సాధించింది.

    5వ రోజు కొనసాగిన జోరు

    5వ రోజు కొనసాగిన జోరు

    అరవింద సమేత చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రలో 50 కోట్ల షేర్ అందుకుకోవడం విశేషం. నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అరవింద సమేత చిత్రం 46.90 కోట్ల షేర్ రాబట్టింది. ఐదవ రోజు మరో 3 కోట్లు జత కావడంతో 50.11 కోట్ల షేర్ సాధించింది.

     చిన్నదైపోయిన టార్గెట్

    చిన్నదైపోయిన టార్గెట్

    ప్రపంచ వ్యాప్తంగా అరవింద సమేత చిత్రానికి 92 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగురాష్ట్రాల్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ 70 కోట్లు. కేవలం ఐదు రోజుల్లోనే తెలుగు రాష్ట్రలో ఈ చిత్రం 50 కోట్లు రాబట్టింది. దసరా పండగ వారం ఇంకా ఉండడంతో మిగిలిన 20 కోట్లు కూడా సులువుగా రాబట్టడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ సత్తాతో టార్గెట్ చిన్నదిగా మారిపోయింది.

     నైజాంలో 15 కోట్లు

    నైజాంలో 15 కోట్లు

    అరవింద సమేత చిత్రం మొదటిరోజునుంచి నైజాం, సీడెడ్ ఏరియాల్లో బలంగా వసూళ్లు రాబడుతోంది. ఐదు రోజుల్లో నైజాం ఏరియాలో షేర్ 15 కోట్లు దాటడం విశేషం. నైజాంలో 19 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సీడెడ్ లో 9.8 కోట్లు, గుంటూరులో 6.36 కోట్లు రాబట్టడం విశేషం.

    English summary
    Aravindha Sametha 5 days box office collections report. AP and TS share details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X