twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అరవింద సమేత’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్... ఎన్టీఆర్ మూవీ సరికొత్త రికార్డ్!

    |

    Recommended Video

    Aravindha Sametha Movie 1st Week Box Office Collections !

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' చిత్రం బాక్సాఫీసువద్ద తిరుగులేకుండా దూసుకెళుతోంది. ఫస్ట్ వీకెండ్ లోపే రూ. 100 కోట్ల(గ్రాస్) వసూలు చేసిన ఈ చిత్రం వీక్ డేస్ లోనూ వసూళ్లు అదరగొట్టింది. బుధవారంతో విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డ్ నమోదు చేసింది.

    ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి వారం రూ. 145 కోట్ల(గ్రాస్) రాబట్టింది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది ఫస్ట్ వీక్ హయ్యెస్ట్ కలెక్షన్స్. పలు తెలుగు సినిమా రికార్డులను సైతం ఈ చిత్రం వెనక్కి నెట్టింది.

     ఫస్ట్ వీక్ షేర్ ఎంత?

    ఫస్ట్ వీక్ షేర్ ఎంత?

    కాగా... అరవింద సమేత వరల్డ్ వైడ్ షేర్ ఆరు రోజుల్లోనే రూ. 75 కోట్ల మార్కును అందుకుంది. 7వ రోజు షేర్ కలిపితే రూ. 80 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రూ. 92 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో రికవరీ ఖాయం అని, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లో ఉన్నట్లే అని అంటున్నారు.

    తెలుగు రాష్ట్రాల్లో ‘అరవింద సమేత' ప్రభంజనం

    తెలుగు రాష్ట్రాల్లో ‘అరవింద సమేత' ప్రభంజనం

    తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో రూ. 55 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. రెండురాష్ట్రాల్లో కలిపి 70 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారు. ఈ దసరా హాలిడే సీజన్ ముగిసే లోపు డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్లడంతో పాటు లాభాలు ఆర్జించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.

    హాట్రిక్ సాధించిన ఎన్టీఆర్

    హాట్రిక్ సాధించిన ఎన్టీఆర్

    కాగా.. యంగ్ టైగర్ నైజాం, సీడెడ్, ఓవర్సీస్ ఏరియాల్లో హాట్రిక్ సాధించాడు. ఆయన నటించిన జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత చిత్రాలు నైజాం ఏరియాలో వరుసగా రూ. 15 కోట్ల షేర్, సీడెడ్లో రూ. 10 కోట్ల షేర్, యూఎస్ఏలో 1.5మిలియన్ డాలర్ గ్రాస్ రాబట్టాయి.

    వంద కోట్లలోనూ రికార్డ్

    వంద కోట్లలోనూ రికార్డ్

    గ్రాస్ పరంగా చూస్తే.... ఎన్టీఆర్ నటించిన మూడు చిత్రాలు వరుసగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాయి. జనతా గ్యారేజ్ రూ. 134 కోట్లు, జై లవ కుశ రూ. 130 కోట్లు, తాజాగా అరవింద సమేత సైతం 100 కోట్ల మార్కును అధిగమించి రికార్డ్ క్రియేట్ చేశాయి.

    ఓవర్సీస్ వసూళ్లు

    ఓవర్సీస్ వసూళ్లు

    అయితే ‘అరవింద సమేత' ఓవర్సీస్ కలెక్షన్స్ కాస్త స్లోగా ఉన్నట్లు టాక్. ఇప్పటి వరకు 2 మిలియన్ డాలర్ వసూలైంది. అయితే సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే 3 మిలియన్లకుపైగా వసూలు చేయాల్సి ఉంది.

    English summary
    "Aravindha Sametha is the Biggest BLOCKBUSTER of 2018 ! It collected FANTASTIC " 145 cr " Worldwide after 1st Week. #JrNTR Biggest HIT ever." Umair Sandhu tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X