'కెమెరామేన్ గంగతో..' ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. గబ్బర్ సింగ్ ఘన విజయంతో ఈ చిత్రం బిజినెస్ మంచి క్రేజ్ తో జరిగింది. అభిమానుల కోసం ఏరియావైజ్ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్...
---------- ------------
నైజాం ---- దిల్ రాజు
సీడెడ్ ---- శోభు
నెల్లూరూ-----గాయిత్రి ఫిల్మ్స్
గుంటూరు---తులసి ఫిల్మ్స్
వైజాగ్-------వర్మ
ఈస్ట్ గోదావరి -------అనుశ్రీ ఫిల్మ్స్
వెస్ట్ గోదావరి ------బన్ని వాసు
మిగిలిన ఇండియా-------రెడ్ జెయింట్ ఫిల్మ్స్
యూరప్-----కలర్స్ మీడియా
బే ( ఆస్ట్రేలియా మరియు న్యూజిల్యాండ్) స్క్రై మూవీస్
ముఖ్యంగా ఈ చిత్రం యు.ఎస్ లో ఓ కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాత డివివి దానయ్య స్వయంగా మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..తాను యు.ఎస్ లో ఈ చిత్రాన్ని స్వయంగా రిలీజ్ చేస్తున్నానని, అక్కడ $ 260 k కి పదమూడు సెంటర్లు అమ్ముడుపోయిందని అన్నారు. ఇది యుఎస్ లో ఓ తెలుగు చిత్రానికి వచ్చిన హైయిస్ట్ ప్రైస్ అని ఇప్పటివరకూ ఈ రేంజి బిజినెస్ ఏ చిత్రానికి జరగలేదని అన్నారు.
తాను పవన్ కళ్యాణ్ సినిమాకు అమెరికాలో వస్తున్న ఈ క్రేజ్ కు చాలా ఆశ్చర్యపోయానని అన్నారు. ఇప్పటికి రోజూ చాలా బిజినెస్ కాల్స్ వస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోందని,అక్టోబర్ 11 న చిత్రం విడుదల చేస్తామని అన్నారు. అలాగే సెప్టెంబర్ మూడవ వారంలో ఆడియోని రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ చిత్రం పవర్ స్టార్ స్టామినాని భాక్సాఫీస్ వ్దద మరోసారి పునర్ నిర్వచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
బ్లూ స్కై ద్వారా అమెరికాలో 'కెమెరామేన్ గంగతో రాంబాబు' విడుదల అవుతోంది. కలర్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ వారు యూరప్, యూకే రైట్స్ తీసుకున్నారు. కేవలం యుకె రైట్స్ కే ముప్పై లక్షలు చెల్లించినట్లు సమాచారం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రైట్స్ ని ముప్పై లక్షలకు ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఇలిక్లయిర్ ఇండియా ఎంటర్టైన్మెట్స్ వారు తీసుకున్నారు. గల్ఫ్, కువైట్ రైట్స్ ని నలభై లక్షలకు, జానకీ రత్న కుమార్ రెడ్డి తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియేల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో-డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి దానయ్య, కథ-స్క్ర్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











