twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది తప్పే.. విజయ్ దేవరకొండ.. అయినా కుమ్మేస్తున్న అర్జున్ రెడ్డి

    దేశ, విదేశాల్లోని తెలుగు ప్రేక్షకులనే కాదు సినీ విమర్శకుల మదిని కొల్లగొట్టిన చిత్రం అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురుస్తుంది. దీంతో అర్జున్ రెడ్డి

    By Rajababu
    |

    Recommended Video

    "Arjun Reddy" Makers Planning To Add Additional 40 Minutes To The Movie

    దేశ, విదేశాల్లోని తెలుగు ప్రేక్షకులనే కాదు సినీ విమర్శకుల మదిని కొల్లగొట్టిన చిత్రం అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురుస్తుంది. దీంతో అర్జున్ రెడ్డి చిత్రం కలెక్షన్ల పరంగా రూ. 50 కోట్ల వసూళ్లు దాటి పోయింది. తొలుత ఈ చిత్రం వివాదాలకు తెరతీసిన సంగతి తెలిసిందే. దాంతో రూ. 50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. మూడు వారాలు దాటినా ఈ చిత్ర కలెక్షన్లు ఏ మాత్రం తగ్గకపోవడం సిని పండితలకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.

    50 కోట్ల క్లబ్ లో...

    50 కోట్ల క్లబ్ లో...

    విడుదలైన నాటి నుంచి ఈ చిత్రం చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. యూఏస్ లో ఈ చిత్రం అద్బుతాలు చేస్తుందని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. అర్జున్ రెడ్డి చిత్రం విడుదలైన మూడో వారానికే అక్కడ 1, 681, 996 డాలర్లు వసూళ్లు చేసిందని (రూ. 10.75 కోట్లు ) చెప్పారు. భవిష్యత్తులో తెలుగు సినిమా గతిని మార్చే చిత్రంగా అర్జున్ రెడ్డి నిలిస్తుందని తరణ్ ఆదర్శ్ ట్విట్ చేశారు.

    అలా హైప్ పెరిగింది...

    అలా హైప్ పెరిగింది...

    ఇప్పటికే నటన పరంగా హీరోహీరోయిన్లు అర్జున్ రెడ్డి, షాలినీ పాండేతోపాటు చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాంగోపాల్ వర్మ, ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అయితే సందీప్ ను ఆకాశానికి ఎత్తేయడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది.

     40 నిమిషాల నిడివి...

    40 నిమిషాల నిడివి...

    ఈ చిత్రం ఘన విజయం వైపు దూసుకుపోతున్న నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ ప్రముఖ దిన పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... ఈ చిత్రంలో దాదాపు 40 నిమిషాల నిడివి గత చిత్రాన్ని కలపబోతున్నట్లు చెప్పారు. చిత్ర నిడివిని తగ్గించే ప్రసక్తే లేదు. నిడివి తగ్గించడం తప్పేనని అనిపిస్తున్నది అని అన్నారు.

    అదే సమస్యే కాదు...

    అదే సమస్యే కాదు...

    నిడివి ఎక్కువ అవుతుందనే కారణంతో విడుదలకు ముందు ఈ చిత్రానికి కీలకంగా మారిన కొన్ని సన్నివేశాలను తొలగించాం. అర్జున్ రెడ్డికి నిడివి ఏ మాత్రం సమస్య కాదని ప్రేక్షకులు తేల్చేశారు. కాబట్టి ఈ చిత్రానికి అదనంగా కొత్త సన్నివేశాలను చేర్చడానికి ప్రయత్నాలు చేపడుతున్నట్లు విజయ్ తెలిపారు.

    English summary
    Arjun Reddy has already grossed more than Rs 50 crore at the domestic box office, and it is also impressing at the international box office too. As per popular trade analyst Taran Adarsh, the movie is rocking at the US box office even in its 3rd week, collecting $1,681,996 which amounts to Rs 10.75 crore. After the initial positive response of the movie, the makers are planning to add additional 40 minutes of footage to the same. Vijay Devarakonda confirmed this when he spoke to a leading daily,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X