బాహుబలి తర్వాత అర్జున్‌రెడ్డి.. 50 రోజుల పండుగ.. ఎన్ని కోట్లు కుమ్మేసిందో తెలుసా?
దక్షిణాదితోపాటు బాలీవుడ్ పరిశ్రమ దృష్టిని మరల్చుకొన్న చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం రిలీజ్ తర్వాత వచ్చిన ప్రతి స్పందన ఈ మధ్యకాలంలో ఎన్నడూ రాలేదు. ఆ తర్వాత అర్జున్ రెడ్డిని పలు భాషల్లో రీమేక్ చేయడానికి డిమాండ్లు భారీగానే వచ్చాయి. ఎలాంటి అంచనాలు లేకుండా టీజర్, ట్రైలర్‌తో దుమ్మురేపి.. ఆ తర్వాత సెన్సేషనల్‌గా హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం అర్జున్ రెడ్డి వంద రోజులు పూర్తి చేసుకొన్నది. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

50 రోజుల పోస్టర్
టాలీవుడ్‌లో బాహుబలి చిత్రాలు తప్పిస్తే ఇటీవల కాలంలో 50 రోజుల పోస్టర్ వేసుకొన్న దాఖలాలు కనిపించవు. అలాంటిది ఓ చిన్న చిత్రం ప్రేక్షకులను మెప్పించి అర్ధ శతదినోత్సవం జరుపుకోవడం ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు.

50 కోట్లకుపైగా కలెక్షన్లు
అర్జున్ రెడ్డి చిత్రం సుమారు 5 కోట్ల రూపాయలతో రూపొందింది. తొలి ఆట నుంచే ఈ సినిమాకు బంపర్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. దాదాపు 50 కోట్లకుపైగా గ్రాస్‌ను వసూలు చేయడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేసింది.
Recommended Video


7 రెట్ల లాభాలు
ఇటీవల కాలంలో సినిమాపై పెట్టిన పెట్టుబడి రావడం కష్టంగా ఉన్న రోజుల్లో అర్జున్ రెడ్డి దాదాపు 6 రెట్ల లాభాలను సంపాదించినట్టు ట్రేడ్ వర్గాల విశ్లేషణ. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఈ చిత్రం 25 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించినట్టు సమాచారం.

రణ్‌వీర్ సింగ్‌తో రీమేక్
ఇక అర్జున్ రెడ్డి చిత్రాన్ని రీమేక్ చేయడానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆసక్తిని చూపినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రాన్ని రణ్‌వీర్ సింగ్‌తో రీమేక్ చేయడానికి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తున్నది. ఈ మేరకు భారీ రేటుకు హక్కులను సొంతం చేసుకొన్నట్టు సమాచారం.

విక్రమ్ కుమారుడు ఎంట్రీ
ఇక తమిళంలో చియాన్ విక్రమ్ కుమారుడు అర్జున్ రెడ్డి రీమేక్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి సేతు చిత్ర దర్శకుడు బాలా దర్శకత్వం వహించనున్నారు. ఈ వార్తను విక్రమ్ తదితరులు సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేశారు.

విజయ్, సందీప్‌కు సూపర్ క్రేజ్
అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం ఆకాశానికి పెరిగింది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ విజయ్ నటనపై, సందీప్‌రెడ్డి వంగాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం తర్వాత విజయ్‌కి భారీగా ఆఫర్లు వచ్చాయి. అంతేకాకుండా మైత్రి మూవీస్ దర్శకుడు సందీప్‌కు క్రేజీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











