‘అర్జున్ రెడ్డి’ ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా?
అర్జున్ రెడ్డి చిత్రం సూపర్ హిట్ అయింది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది.
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్ ముందే భారీ హైప్ రావడం 'అర్జున్ రెడ్డి'కి బాగా కలిసొచ్చింది.
ప్రేక్షకుల అంచనాలు వందకు వందశాతం అందుకున్న ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 'అర్జున్ రెడ్డి' చిత్రం తొలి రోజు రూ. 4 కోట్లు వసూలు చేసింది.

సూపర్ కలెక్షన్స్
సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు లేక పోయినా, భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ కాకపోయినా సినిమాకు తొలి రోజే ఇంత కలెక్షన్ రావడం గొప్పే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. సినిమా ఫుల్ రన్ లో నిర్మాతలకు 4 నుండి 5 రెట్లు లాభం తెచ్చి పెడుతుందని టాక్.

సినిమా బడ్జెట్ ఎంత?
‘అర్జున్ రెడ్డి' సినిమాకు కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. సినిమాకు ఉన్న క్రేజ్, కలెక్షన్ల జోరు చూస్తుంటే ఓవరాల్ రన్‌లో రూ. 20 కోట్ల షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు
‘అర్జున్ రెడ్డి' చిత్రాన్ని యూఎస్ బయ్యర్ రూ. 60 లక్షలకు కొనుగోలు చేశాడు. కేవలం ప్రీమియర్ షోల ద్వారా ఇంతకు మించిన మొత్తం అతడికి తిరిగి వచ్చిందట. ఇక లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

అర్జున్ రెడ్డి
అర్జున్ రెడ్డి మూవీ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం... సినిమా ఇప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీల కంటే కొత్తగా ఉండటం, మేకింగ్ రియలిస్టిక్ గా ఉండటం. వీటన్నింటికీ మించి విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ సినిమాకు బాగా ప్లస్సయింది.


Click it and Unblock the Notifications











