Arjun S/O Vyjayanthi Closing Collections : కళ్యాణ్‌రామ్ మూవీకి లాభమెంత? నష్టమెంత?

ఎన్టీఆర్ ఆర్ట్స్ , అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్‌రామ్, అశోక్ వర్ధన్ ముప్పాలు సంయుక్తంగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రాన్ని నిర్మించారు. నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతిలు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? ఈ సినిమాకు లాభమా? నష్టమా? అనే వివరాల్లోకి వెళితే..

అప్పుడెప్పుడో బింబిసారతో హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఆ తర్వాత చేసిన డెవిల్, అమిగోస్ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. కెరీర్‌లో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆయన నటించిన చిత్రమే అర్జున్ సన్నాఫ్ వైజయంతి. లేడీ అమితాబ్ విజయశాంతి ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

Arjun S O Vyjayanthi Box Office Closing Collections Worldwide How much loss or profit for nandamuri kalyan ram s Movie

అర్జున్ సన్నాఫ్ వైజయంతీ చిత్రంలో సయీ మంజ్రేకర్, అర్జున్ రాంపాల్, శరత్ కుమార్, శ్రీకాంత్, సొహైల్ ఖాన్, బాబ్లూ పృథ్వీరాజ్ తదితరులు కీలకపాత్ర పోషించారు. అజనీష్ లోక్‌నాథ్, రాంప్రసాద్ లాంటి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో భాగమయ్యారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలు, ఇతర ఖర్చులతో కలిపి అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రానికి దాదాపు రూ.45 కోట్ల మేర బడ్జెట్ అయిందని ట్రేడ్ పండితులు తెలిపారు.

కళ్యాణ్‌రామ్‌తో కలిసి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి నటిస్తుండటం.. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజెనెస్ బాగానే జరిగింది. ఆంధ్రా, నైజాంలలో 18 కోట్ల రూపాయలు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ హక్కులు 4 కోట్ల రూపాయల చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.22 కోట్ల మేర ఈ సినిమాకు బిజినెస్ జరిగింది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ సేఫ్ జోన్‌లోకి రావాలంటే.. 25 కోట్ల రూపాయల షేర్, రూ.50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

సినిమాపై ఉన్న అంచనాలు, కళ్యాణ్‌రామ్ ఇమేజ్ దృష్టిలో ఉంచుకుని అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1250 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో 750 స్క్రీన్లు, ఇతర ప్రాంతాల్లో 500 స్క్రీన్లలో విడుదల చేశారు. అయితే ఆ రేంజ్‌లో ఈ సినిమాకు ఓపెనింగ్స్ రాకపోవడం నిరాశపరిచింది. తొలి రోజున రూ.3.4 కోట్ల నెట్, 2వ రోజున రూ.1.95 కోట్ల నెట్, 3వ రోజున రూ.2.1 కోట్ల నెట్, 4వ రోజున రూ.0.97 లక్షల నెట్, 5వ రోజున రూ.78 లక్షల నెట్, 6వ రోజున రూ.74 లక్షల నెట్, 7వ రోజున రూ.57 లక్షల నెట్, 8వ రోజున రూ.39 లక్షల నెట్, 9వ రోజున రూ.35 లక్షల నెట్ సాధించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది.

మొత్తంగా 9 రోజుల వరకు అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ఇండియా వైడ్ రూ.8.7 కోట్ల నెట్, రూ.11.33 కోట్ల గ్రాస్ అందుకుంది. ఓవర్సీస్‌‌లో వచ్చిన కోటి రూపాయల గ్రాస్ + ఇండియాలో వచ్చిన గ్రాస్ కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12.33 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ తెలిపింది.

ఇక అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ప్రకారం చూస్తే.. ఈ సినిమా కేవలం 25 శాతం రికవరీ మాత్రమే సాధించి, సుమారుగా 30 కోట్ల రూపాయల మేర నష్టాలతో ముగిసే అవకాశం ఉంది. ఓవరాల్‌ బడ్జెట్ ప్రకారం చూస్తే.. ఈ సినిమా స్వల్ప లాభాలు అందుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ఈ నష్టాన్ని కొంత మేరకు తగ్గించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X