Arjun Son of Vyjayanthi Collections: అర్జున్ సన్నాఫ్ వైజయంతీ కలెక్షన్లు.. కల్యాణ్ రామ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
నందమూరి కల్యాణ్ రామ్, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి, శ్రీకాంత్, బాలీవుడ్ నటులు సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతీ. ప్రదీప్ చిల్కూరి దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్, సునీల్ బలుసు, ముప్పా వెంకయ్య చౌదరీ, అశోక్ వర్ధన్ ఈ సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్‌పై సంయుక్తంగా రూపొందించిన ఈ మూవీ ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? వసూలు చేసిన కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
అర్జున్ సన్నాఫ్ వైజయంతీ మూవీ సినిమాను భారీ తారాగాణం, టాలెంటెడ్ టెక్నిషియన్స్‌తో ఖర్చుకు వెనుకాడకుండా ఈ మూవీని నిర్మించారు. అజనీష్ లోక్‌నాథ్, రాంప్రసాద్ లాంటి టెక్నిషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు. దాంతో ఈ సినిమా నిర్మాణ వ్యయం సుమారుగా 45 కోట్ల మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌కు భారీగా స్పందన రావడంతో బిజినెస్ కూడా గ్రాండ్ నంబర్స్‌తో ముగిసిందని పేర్కొన్నారు.

కల్యాణ్ రామ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులు సుమారుగా 18 కోట్ల రూపాయలకు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ హక్కులు సుమారుగా 4 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ రిపోర్ట్ వెల్లడించింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం ఈ చిత్రం 25 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ అనలిస్టులు పేర్కొన్నారు.
విజయశాంతి చాలా రోజుల తర్వాత మళ్లీ పోలీస్ పాత్రలో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో 750 స్క్రీన్లు, ఇతర ప్రాంతాల్లో 500 స్క్రీన్లలో విడుదల చేశారు.
అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమాకు యావరేజ్‌గానే ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. మార్నింగ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 30 శాతం ఆక్యుపెన్సీ, ఫస్టా షోకు 32 శాతం, సెకండ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. కాకినాడ, వైజాగ్, చెన్నై, గుంటూరు, వరంగల్, నిజమాబాద్, వరంగల్ జిల్లాలో 30 శాతం నుంచి 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైందని సాక్ నిల్క్ వెల్లడించింది.
ఇక ఈ సినిమా తొలి రోజు ఊహించిన దాని కంటే తక్కువగానే కలెక్షన్లు నమోదు చేసినట్టు తాజా ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ సినిమా గతంలో కల్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా సుమారుగా 5 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే.. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 4 నుంచి 4.5 కోట్లు వసూలు చేయవచ్చని అంచనా వేశారు. ఏపీ, తెలంగాణలో 2 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టవచ్చని వెల్లడించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 25 కోట్ల షేర్, 50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











