Arjun Son of Vyjayanthi Collections : కళ్యాణ్‌రామ్ మాస్ కుమ్ముడు .. రెండో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ నటి, లేడీ అమితాబ్ విజయశాంతి కీలకపాత్ర పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్, అశోక్ వర్ధన్, సునీల్ బులుసు, ముప్పా వెంకయ్య చౌదరీలు సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 18న అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్ జరిగిన థియేట్రికల్ బిజినెస్ ఎంత? ఈ సినిమా సాధించిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

అర్జున్ సన్నాఫ్ వైజయంతి బడ్జెట్ ఎంత ( Arjun Son of Vyjayanthi Budget)?
అర్జున్ సన్నాఫ్ వైజయంతీ చిత్రంలో సయీ మంజ్రేకర్, అర్జున్ రాంపాల్, శరత్ కుమార్, శ్రీకాంత్, సొహైల్ ఖాన్, బాబ్లూ పృథ్వీరాజ్ తదితరులు కీలకపాత్ర పోషించారు. అజనీష్ లోక్‌నాథ్, రాంప్రసాద్ లాంటి టెక్నిషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలు, ఇతర ఖర్చులతో కలిపి ఈ సినిమాకు దాదాపు రూ.45 కోట్ల మేర బడ్జెట్ అయిందని ట్రేడ్ పండితులు తెలిపారు.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత ( Arjun Son of Vyjayanthi Break Even Target )?
కళ్యాణ్‌రామ్‌తో కలిసి విజయశాంతి నటిస్తుండటంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజెనెస్ బాగానే జరిగింది. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ హక్కులు సుమారుగా 18 కోట్ల రూపాయలకు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ హక్కులు సుమారుగా 4 కోట్ల రూపాయల చొప్పున మొత్తంగా రూ.22 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కళ్యాణ్ రామ్ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం ఈ చిత్రం 25 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
తొలి రోజు వసూళ్లు ( Arjun Son of Vyjayanthi 1st Day Collections)
అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1250 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో 750 స్క్రీన్లు, ఇతర ప్రాంతాల్లో 500 స్క్రీన్లలో విడుదల చేశారు. ప్రమోషనల్ కార్యక్రమాలతో మంచి బజ్ నెలకొన్నప్పటికీ ఫస్ట్ డే ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో రాలేదు. తొలి రోజు ఈ చిత్రం భారత్‌లో నికరంగా రూ.3.4 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్లు రాబట్టినట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ తెలిపింది. కళ్యాణ్‌రామ్ గత చిత్రాలు అమిగోస్ రూ.5.05 కోట్లు, డెవిల్ రూ.4.6 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టాయి.
రెండో రోజు కలెక్షన్స్ అంచనా ( Arjun Son of Vyjayanthi Day 2 Collections)
వీకెండ్, వేసవి సెలవుల నేపథ్యంలో రెండో రోజు కళ్యాణ్‌రామ్ చిత్రానికి మంచి బుకింగ్స్ జరిగాయి. రెండో రోజైన శనివారం సాయంత్రం 7 గంటల వరకు తెలుగులో ఓవరాల్‌గా 19.93 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. సాయంత్రం 7 గంటల వరకు హైదరాబాద్‌లో 236 షోలు, బెంగళూరులో 91 షోలు, విజయవాడలో 76 షోలు, విశాఖలో 58 షోలు పడ్డాయి. రెండో రోజు అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.3.5 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి కళ్యాణ్ రామ్ చిత్రం ఎంత మేరకు వసూళ్లు చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











