Arjun Son of Vyjayanthi Collections : కళ్యాణ్‌ రామ్ వీకెండ్ జోరు.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేశాడంటే

నందమూరి కళ్యాణ్‌రామ్ లేటెస్ట్ ఫిల్మ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. సీనియర్ నటి, లేడీ అమితాబ్ విజయశాంతి తల్లిపాత్రలో నటించింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్, అశోక్ వర్ధన్, సునీల్ బలుసు, ముప్పా వెంకయ్య చౌదరీలు సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 18న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? ఈ సినిమా 3 రోజుల్లో సాధించిన వసూళ్లు ఎంతనే వివరాల్లోకి వెళితే..

అర్జున్ సన్నాఫ్ వైజయంతి బడ్జెట్ ఎంత ( Arjun Son of Vyjayanthi Budget)?
అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రాన్ని విజువల్ ప్రకారంగా గ్రాండ్ గా తెరకెక్కించారు. పైగా సినిమాలోని స్పెషల్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ లకు బాగానే ఖర్చైంది. అలాగే మూవీలో భారీ తారాగణం విజయశాంతితో పాటు యంగ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్, అర్జున్ రాంపాల్, శరత్ కుమార్, శ్రీకాంత్, సొహైల్ ఖాన్, బాబ్లూ పృథ్వీరాజ్ నటించారు. అజనీష్ లోక్‌నాథ్, రాంప్రసాద్ లాంటి టెక్నీషియన్లు పనిచేశారు. నిర్మాణ వ్యయ ఖర్చు, పారితోషికాలు, ప్రమోషన్ల అన్నీ కలుపుకొని దాదాపు రూ.45 కోట్ల వరకు ఖర్చైందని ట్రేడ్ పండితులు తెలిపారు.

Arjun Son of Vyjayanthi Day 3 Expected Box Office Collections Worldwide

అర్జున్ సన్నాఫ్ వైజయంతి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత ( Arjun Son of Vyjayanthi Break Even Target )?
'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ సినిమాలకు ఓ మాదిరిగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో విజయశాంతి కూడా ఉండటం, ప్రమోషనల్ మెటీరియల్ అదిరిపోవడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్ రూ.18 కోట్లకు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ రైట్స్ రూ.4 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో వరల్డ్ వైడ్ గా రూ.22 కోట్ల మేర బిజినెస్ అయ్యింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.25 కోట్ల షేర్ వసూల్ చేయాలని ట్రేడ్ నిపుణులు వాల్యూ కట్టారు.

తొలి 2 రోజుల వసూళ్లు ( Arjun Son of Vyjayanthi 2 Days Collections)
ప్రపంచవ్యాప్తంగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రాన్ని 1250 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో 750 స్క్రీన్లు, ఇతర ప్రాంతాల్లో 500 స్క్రీన్లలో విడుదలైంది. ఓపెనింగ్ డే ఇండియా నెట్ రూ.3.4 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్ల గ్రాస్ అందుకుందని, 2వ రోజు రూ.1.95 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా గ్రాస్ రూ.3.5 కోట్ల వరకు వసూళ్లు చేసిందని ట్రేడ్ పండింతులు చెబుతున్నారు.

3వ రోజు కలెక్షన్స్ అంచనా ( Arjun Son of Vyjayanthi Day 3 Collections)
3వ రోజు వీకెండ్ ఫస్ట్ ఆదివారం అయినా థియటర్లలో పెద్దగా ఆక్యుపెన్సీ కనిపించలేదు. మార్నింగ్ షోలకు 15.56 శాతం, ఆఫ్టర్ నూన్ షోస్ రూ.25.74 శాతం, ఈవెనింగ్, నైట్ షోస్ కు 30 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదైనట్టు తెలుస్తోంది. దీంతో సాయంత్రం వరకు ఈ చిత్రం రూ.1.35 కోట్ల ఇండియా నెట్ ను వసూళ్లు చేసింది. ఇక మిగిలిన షోస్ కలుపుకొని రూ.2 కోట్ల నెట్ అందుకుంటుందని నిపుణుల అంచనా. దీంతో సండే కూడా రూ.4.5 నుంచి రూ.5 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసి ఉంటుందని ట్రేడ్ పండింతులు అంచనా వేస్తున్నారు.

Disclaimer: ఈ పేజీలోని సినిమా బాక్సాఫీస్‌ రిపోర్టులకు సంబంధించిన సమాచారం https://www.sacnilk.com/, ప్రొడక్షన్ హౌస్‌‌లు, సొషల్ మీడియా అకౌంట్లు వెల్లడించిన వివరాల ఆధారంగా పొందుపరచడం జరిగింది. సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల‌కు సంబంధించి వెల్లడించే రిపోర్టులకు ఫిల్మీబీట్ ఎలాంటి బాధ్యత వహించదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X