Arjun Son of Vyjayanthi Collections : పట్టువదలని కళ్యాణ్ రామ్.. 4వ రోజు ఎంత వసూలైందంటే?

సీనియర్ నటి విజయశాంతి తల్లిపాత్రలో, నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్, అశోక్ వర్ధన్, సునీల్ బలుసు, ముప్పా వెంకయ్య చౌదరీలు సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? 4 రోజుల్లో సాధించిన వసూళ్లు ఎంతనే వివరాల్లోకి వెళితే..

అర్జున్ సన్నాఫ్ వైజయంతి బడ్జెట్ ఎంత ( Arjun Son of Vyjayanthi Budget)?
అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రానికి భారీగానే ఖర్చు చేశారు. ఈ మూవీలోని విజువల్స్, భారీ యాక్షన్స్, ప్రత్యేకమైన క్లైమాక్స్ కోసం బాగానే ఖర్చైంది. విజయశాంతి, సయీ మంజ్రేకర్, అర్జున్ రాంపాల్, శరత్ కుమార్, శ్రీకాంత్, సొహైల్ ఖాన్, బాబ్లూ పృథ్వీరాజ్ వంటి ప్రముఖలు నటించడంతోపాటు, అజనీష్ లోక్‌నాథ్, రాంప్రసాద్ లాంటి టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేశారు. నిర్మాణ వ్యయం, పారితోషికాలు, ప్రమోషన్లు కలుపుకొని దాదాపు రూ.45 కోట్ల వరకు ఖర్చైందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

Arjun Son of Vyjayanthi Day 4 Box Office Collections Worldwide

అర్జున్ సన్నాఫ్ వైజయంతి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత ( Arjun Son of Vyjayanthi Break Even Target )?
కళ్యాణ్ రాజ్ మార్కెట్ కు, విజయశాంతి కూడా తోడవటంతో ఈ సినిమాకు ఓ మాదిరిగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రమోషనల్ మెటీరియల్ అదిరిపోవడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్ రూ.18 కోట్లకు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ రైట్స్ రూ.4 కోట్ల, ఇలా వరల్డ్ వైడ్ గా రూ.22 కోట్ల మేర బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.25 కోట్ల షేర్ వసూల్ చేయాలని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు.

గత 3 రోజుల వసూళ్లు (Arjun Son of Vyjayanthi 3 Days Collections)
వరల్డ్ వైడ్ గా అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రాన్ని 1250 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో 750 స్క్రీన్లు, ఇతర ప్రాంతాల్లో 500 స్క్రీన్లలో విడుదల చేశారు. ఓపెనింగ్ డేనే ఇండియా నెట్ రూ.3.4 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్ల గ్రాస్ అందుకుంది. 2వ రోజు రూ.1.95 కోట్లు, 3వ రోజు రూ. 2.1 కోట్లు వసూళ్లు చేసింది.

4వ రోజు వసూళ్లు (Arjun Son of Vyjayanthi 4th Day Collections)

4వ రోజు (సోమవారం) వర్కింగ్ డే అయినప్పటికీ కేవలం తెలుగులోనే రూ.97 లక్షలు వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ తెలుపుతోంది. మిగితా వసూళ్లు కలుపుకొని డే4న రూ.1కోటీకిపైనే నెట్ అందుకుందని ట్రేడ్ పండింతులు అంటున్నారు.ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 2రోజుల్లోనే రూ.8.55 కోట్ల గ్రాస్ అందుకుందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఇక సాక్ నిల్క్ రిపోర్ట్ ప్రకారం.. 4రోజుల్లో ఇండియా నెట్ రూ.8.42 కోట్లు వసూళ్లు చేసిందని వెల్లడించింది. ఇక ఇండియా గ్రాస్ రూ.9.7 కోట్లు, వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.11 కోట్లు వసూళ్లు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ఈ చిత్రం ఓవర్సీస్ లో ఇప్పటి వరకు రూ.1కోటీ వసూల్ చేసింది.

Disclaimer: ఈ పేజీలోని సినిమా బాక్సాఫీస్‌ రిపోర్టులకు సంబంధించిన సమాచారం https://www.sacnilk.com/, ప్రొడక్షన్ హౌస్‌‌లు, సొషల్ మీడియా అకౌంట్లు వెల్లడించిన వివరాల ఆధారంగా పొందుపరచడం జరిగింది. సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల‌కు సంబంధించి వెల్లడించే రిపోర్టులకు ఫిల్మీబీట్ ఎలాంటి బాధ్యత వహించదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X