Arjun Son of Vyjayanthi Day 5 Collections: అర్జున్ సన్నాఫ్ వైజయంతీ బాక్సాఫీస్ కలెక్షన్లు.. లాభాల్లోకి రావాలంటే
నందమూరి కల్యాణ్ రామ్, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి, శ్రీకాంత్, బాలీవుడ్ నటులు సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతీ. ప్రదీప్ చిల్కూరి దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్, సునీల్ బలుసు, ముప్పా వెంకయ్య చౌదరీ, అశోక్ వర్ధన్ ఈ సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్‌పై సంయుక్తంగా రూపొందించిన ఈ మూవీ ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? వసూలు చేసిన కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
అర్జున్ సన్నాఫ్ వైజయంతీ మూవీ సినిమాను భారీ తారాగాణం, టాలెంటెడ్ టెక్నిషియన్స్‌తో ఖర్చుకు వెనుకాడకుండా ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం సుమారుగా 45 కోట్ల మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులు సుమారుగా 18 కోట్ల రూపాయలకు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ హక్కులు సుమారుగా 4 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ రిపోర్ట్ వెల్లడించింది.

అర్జున్ సన్నాఫ్ వైజయంతీ మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో 750 స్క్రీన్లు, ఇతర ప్రాంతాల్లో 500 స్క్రీన్లలో విడుదల చేశారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం ఈ చిత్రం 25 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ అనలిస్టులు పేర్కొన్నారు. భారీ అంచనాలతో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన సినిమా చాలా రోజుల తర్వాత రావడంతో అందరిలోను ఆసక్తి కనిపించింది. కల్యాణ్ రామ్, విజయశాంతి క్రేజీ కాంబినేషన్‌తో వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ రెస్సాన్స్ సొంతం చేసుకొన్నది. అయినప్పటికీ.. ఈ చిత్రం తొలి రోజు 3.5 కోట్ల రూపాయలు నెట్, 5 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మూడు రోజుల్లోనే ఈ సినిమా 12 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది అని ఎన్టీఆర్ ఆర్ట్స్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
ఇక అర్జున్ సన్నాఫ్ వైజయంతీ మూవీ సినిమా పూర్తిస్థాయి కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 5.5 కోట్లకుపైగా గ్రాస్, రెండో రోజు 3.5 కోట్ల గ్రాస్, మూడో రోజు 3.5 కోట్లు, నాలుగో రోజు 2 కోట్ల గ్రాస్, 5వ రోజు 1.25 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని సాక్ నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. దాంతో ఈ సినిమా 9 కోట్లకుపైగా నెట్, 15 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కల్యాణ్ రామ్ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సుమారుగా 1.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని వెల్లడించారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం ఈ మూవీ ఇంకా భారీగా వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 15 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











