అర్జున్ సురవరం.. లేటైనా భారీగానే లూటీ.. ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్లు

ఎన్నో వాయిదాలు.. మరెన్నో వివాదాలు.. సినిమా విడుదల అవుతుందా? అనే అనుమానాలు ఇలా ఎన్నో ఇక్కట్లను దాటుకుని మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది అర్జున్ సురవరం. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా ఎట్టకేలకు ఆడియెన్స్‌ను మెప్పించి.. హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇంతవరకు తాను చేసిన పదిహేడు చిత్రాలకు ఇటువంటి పరిస్థితి రాలేదని చెప్పుకొచ్చిన నిఖిల్.. ఈ సినిమా హిట్ అవడంతో ఆనందంలో మునిగిపోతున్నాడని తెలుస్తోంది.

రీమేక్ అయినా నేటివిటీకి దగ్గరగా..

రీమేక్ అయినా నేటివిటీకి దగ్గరగా..

తమిళ హిట్ మూవీ కణితన్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించిన అర్జున్ సురవరం.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేయడంతో బాగానే ఆకట్టుకుంది. కాస్త ఎక్కువగానే కమర్షియల్ హంగులు అద్దారనే టాక్ వచ్చినా.. ఒరిజినల్ మూవీని చూడని వారిని మెప్పించే విధంగానే ఉండటం కలిసి వచ్చిన అంశం.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో..

ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడం, మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు జోరందుకున్నాయి. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. అన్ని ఏరియాలో కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి..

నైజాం, సీడెడ్‌లో..

నైజాంలో ఫస్ట్ డే 31లక్షలు, సీడెడ్‌లో 17లక్షలు, ఈస్ట్ 12లక్షలు, వెస్ట్ 10లక్షలు, గుంటూరు 29లక్షలు, కృష్ణ 11.8లక్షలు, నెల్లూరు 8లక్షలు మొత్తంగా 1.38కోట్లు వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. ఇక మొదటి రోజే ఈ రేంజ్ వసూళ్లను సాధిస్తే.. వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ సాధించేట్టు కనిపిస్తోంది.

Recommended Video

#CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?
ఇచ్చిపడేశారుగా..

ఇచ్చిపడేశారుగా..

మొదటి రోజే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 4.1 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు నిఖిల్ ఓ అధికారిక పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సినిమాను ఆధరించే తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ.. ఇచ్చిపడేశారుగా అని పోస్ట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X