100 కోట్లపై కన్నేసిన టొవినో థామస్.. ఏఆర్‌ఎమ్‌కు వరల్డ్ వైడ్ ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన తాజా చిత్రం A.R.M (Ajayante Randam Moshanam) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నది. జితిన్ లాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి జోసెఫ్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ముఖ్యంగా కేరళలో రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతున్నది. సెప్టెంబర్ 12వ తేదీన రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ చిత్రం గత 11 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మ్యాజిక్ ఫ్రేమ్స్, యూజీఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై మూడూ జనరేషన్ల బ్యాక్ డ్రాప్‌తో భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల కాలంలో అత్యధికంగా సాంకేతిక నైపుణ్యంతో ఈ సినిమాను సుమారుగా 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. మలయాళంతోపాటు ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. 35 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

ARM Movie 11 Days Expected Box Office Collections Worldwide Tovino Thomas racing towards 100 crores

ఈ మూవీకి కేరళ, ఓవర్సీస్‌లో భారీ స్పందనను సొంతం చేసుకొన్నది. తెలుగు రాష్ట్రాల్లోను, కన్నడ, తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా తొలి రోజు 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలివారాంతానికి ఈ చిత్రం 33 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను వరల్డ్ వైడ్‌గా కలెక్ట్ చేసింది.

టొవినో థామస్ నటించిన ఈ మూవీ తొలివారం మంచి వసూళ్లతో ముగించింది. ఈ చిత్రం మలయాళంలో 26 కోట్ల రూపాయలు, హిందీలో 1 కోటి రూపాయలు, తెలుగులో 1.25 కోట్లు, కన్నడలో 50 లక్షలు, తమిళంలో 1 కోటి రూపాయలు రాబట్టింది. దాంతో ఇండియాలో ఈ మూవీ ఫస్ట్ వీక్ 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ARM Movie 11 Days Expected Box Office Collections Worldwide Tovino Thomas racing towards 100 crores

ఇక రెండోవారంలో అదే జోష్‌ను కొనసాగిస్తున్నది.కేరళలో ఈ సినిమా 9వ రోజు 2.5 కోట్లు, 10వ రోజు 3.25 కోట్లు, 11వ రోజు 3.5 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 38 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది. కేరళలోనే ఈ సినిమా 30 కోట్ల నికర కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది.

ARM Movie 11 Days Expected Box Office Collections Worldwide Tovino Thomas racing towards 100 crores

ఏఆర్ఎమ్ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కేరళలో 39 కోట్ల గ్రాస్, ఇతర రాష్ట్రాల్లో 5 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 3.25 మిలియన్లు అంటే సుమారుగా 27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 70 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: arm tovino thomas kriti shetty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X