Article 370 Collections ప్రియమణి మూవీకి 60 కోట్ల కలెక్షన్లు.. ఎన్ని కోట్ల లాభమంటే?

బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై దర్శకుడు ఆదిత్య సుహాస్ రూపొందించిన చిత్రం ఆర్టికల్ 370. సీనియర్ హీరోయిన్లు ప్రియమణి, యామీ గౌతమి ప్రధాన పాత్రలో రామాయణం ఫేమ్ రాముడు అరుణ్ గోవిల్, కిరణ్ కర్మాకర్కర్ తదితరులు నటించారు. గత వారం రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా కలెక్షన్లు, బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే..

జమ్ము, కాశ్మీర్ స్టేట్‌కు ఆర్టికల్ 370 విషయంలో మహారాజా హరిసింగ్‌తో జవహార్ లాల్ తీసుకొన్న లోపభూయిష్టమైన విధానాలను ఎత్తిచూపుతూ ఈ సినిమాను రూపొందించారు. మరుగుపడిన వాస్తవాలకు ఫిక్షన్ జోడించి చేసిన చిత్రం. పొలిటికల్, వార్ డ్రామాగా ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాకు క్రిటిక్స్ సానుకూలంగా స్పందించడంతో తొలి రోజు నుంచే మంచి కలెక్షన్లు నమోదు అయ్యాయి.

Article 370 day 11 expected Collections Worldwide Priyamani s movie targets 100 Crore Mark

ఆర్టికల్ 370 చిత్రంలో అగ్ర నటీనటులు ఉండటం, సినిమాను భారీగా ప్రమోట్ చేయడంతో బడ్జెట్ అధికంగానే అయింది. ఈ సినిమాను అన్ని ఖర్చులతో కలిపి 40 కోట్ల రూపాయలు మేర బడ్జెట్ అయింది. ఇక ఈ సినిమాకు మంచి బజ్ రావడంతో ఇండియాలో 1500 స్క్రీన్లలోను, ప్రపంచవ్యాప్తంగా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేయడంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌ను 40 కోట్లుగా వాల్యూ కట్టారు.

ఆర్టికల్ 370 మూవీ భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. తొలి రోజు 6 కోట్ల రూపాయలు, రెండో రోజు 7.5 కోట్ల రూపాయలు, 3వ రోజు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలివారాంతానికి ఈ సినిమా 23.5 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. తొలి వీకెండ్ తర్వాత కూడా నిలకడగా వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాల్లో జోష్ నింపింది.

Article 370 day 11 expected Collections Worldwide Priyamani s movie targets 100 Crore Mark

ఆర్టికల్ 370 మూవీ వీక్ డేస్‌లో కూడా బాక్సాఫీస్ వద్ద బలంగా కనిపించింది. సాధారణంగా సోమవారం ప్రతీ సినిమాకు ఉండే లిట్మస్ టెస్ట్‌ పాస్ అయింది. 4వ రోజు 3.25 కోట్లు, 5వ రో 3.5 కోట్లు, 6వ రోజు 3.15 కోట్లు, 7వ కోట్లు 3 కోట్లు వసూలు చేయడంతో 36 కోట్ల రూపాయలు తొలివారంలో సంపాదించింది.

ఇక మౌత్ టాక్ పెరగడంతో ఆర్టికల్ 370 చిత్రం రెండోవారంలో కూడా మొదటి వారం కంటే ఘనంగా వసూళ్లను సాధించింది. ఎనిమిదో రోజు 3 కోట్ల రూపాయలు, సెకండ్ వీకెండ్‌లో శనివారం అంటే 8వ రోజు 5.5 కోట్ల రూపాయలు, ఆదివారం 9వ రోజు 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 50 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

Article 370 day 11 expected Collections Worldwide Priyamani s movie targets 100 Crore Mark

ఇక ఆర్టికల్ 370 చిత్రానికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఓవర్సీస్‌లో మంచి ప్రభావమే చూపించింది. ఈ సినిమా గత 10 రోజుల్లో 1 మిలియన్‌కు పైగా వసూళ్లను సాధించింది. ఇండియా, అమెరికా, ఇతర దేశాల్లో వసూళ్లు కలిపితే ఈ చిత్రం సుమారుగా 60 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X