twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్య 2 ఫస్ట్ వీక్ కలెక్షన్ ఎంతంటే...

    By Srikanya
    |

    అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య-2 చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పదహారు కోట్లు అని వినపడుతోంది. నైజాంలో 4.10 కోట్లు, వైజాగ్ లో 1 కోటి, గుంటూరులో ఎనభై లక్షలు..ఇలా లెక్కలు చెప్తున్నారు. తెలంగాణ బంద్ వల్ల ఈ రెండు రోజుల్లో నైజాం ఏరియాలో బాగా నష్టపోయనట్లేనని అంటున్నారు. అప్పటికీ బన్నీకి నైజాంలో మంచి పట్టు ఉండటంతో ప్లస్ అయిందని అంటున్నారు. నైజాం ఏరియాకి ఈ చిత్రం పంపిణీదారుడు దిల్ రాజు. ఇక ఈ లెక్కలు కరెక్టు కాదని, కావాలనే వీటిని ప్రచారంలోకి తీసుకువస్తున్నారని మరో వర్గం వాదిస్తోంది. సినిమా హిట్,ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా ఈ చిత్రం మంచి ఓపినింగ్స్ మాత్రం తెచ్చుకుందనేది మాత్రం నిజం. సిటీల్లో ఈ చిత్రం హవా పూర్తిగా తగ్గినా బి,సి సెంటర్లలో ఫరవాలేదనిపించుకుంటోందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య కి సీక్వెల్ కావటం ఈ చిత్రానికి కొంతలో కొంత ప్లస్ అయింది. ఇక ఈ చిత్రానికి ప్రమేషన్ మాత్రం అల్లు అర్జున్ భారీ ఎత్తున చేపడుతున్నాడు. టీవీ ఛానెల్స్ కు తరుచూ వెళ్ళి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X