Arya 2 Re Release Collections: ఆర్య 2 రీ రిలీజ్ కలెక్షన్లు.. మహేష్, పవన్ రికార్డులకు దూరంగా అల్లు అర్జున్
పుష్ప డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్, శ్రద్దాదాస్ నటించిన చిత్రం ఆర్య 2. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, ఆదిత్యబాబు నిర్మించారు. 2009 నవంబర్ 27వ తేదీన రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. అయితే పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ హావా నడుస్తుండటంతో ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందకు తీసుకొచ్చారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం వహించిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఆ సమయంలో ఎంత వసూలు చేసింది? రీ రిలీజ్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..
ఆర్య సినిమా బ్లాక్‌బస్టర్ విజయంతో అంచనాలు భారీగా ఉండటంతో ఆర్య 2 వాటికి అనుగుణంగా టాప్ స్టార్ కాస్ట్, టెక్నిషియన్స్‌తో సినిమాను రూపొందించారు. ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 25 కోట్ల రూపాయలుగా అయిందని వెల్లడించారు. ఈ సినిమాను వయాకామ్18 స్టూడియోస్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అయితే ఈ సినిమా ఆర్యపై ఉన్న అంచనాలను అందుకోకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది.

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమా మరోటి ఈ మధ్యలో రిలీజ్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో ఆర్య 2ను రీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాలోని పాటలు హిట్ అవ్వడం, ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మ్యూజిక్ ఆల్బమ్‌గా ఉండటంతో అల్లు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వ్యక్తమవుతుందని ఆశించారు. అయితే ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఈ సినిమాను జీరో ప్రమోషన్స్‌తో మూవీని రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్‌లో భారీగా టికెట్లు అమ్ముడుపోయాయి.
ఆర్య 2 సినిమా రీ రిలీజ్‌కు మంచి స్పందన రావడంతో తొలి రోజు భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా సుమారుగా 2.66 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు స్టైలిష్ స్టార్ రీ రిలీజ్‌లో ఇదే అత్యుత్తమ వసూళ్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా మొత్తంగా 3.74 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.
ఆర్య 2 సినిమా రెండో రోజు పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.9 కోటి గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా రీ రిలీజ్ రూపంలో మొత్తంగా 5.64 కోట్ల రూపాయలు వసూలు చేసిందని పేర్కొంటున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ చేసి ఉంటే ఇంకా బెటర్‌గా కలెక్షన్లు వచ్చి ఉండేవనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో గిల్లీ చిత్రం 32.5 కోట్ల రూపాయలతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 8.9 కోట్ల రూపాయలతో మురారీ 4K రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ 8 కోట్లు, ఖుషీ 7.5 కోట్లు, బిజినెస్‌మ్యాన్ చిత్రం 5.85 కోట్ల రూపాయలతో 5వ స్థానంలో నిలిచింది. అయితే ప్రస్తుతం ఐకాన్ స్టార్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొంటే ఆర్య 2 టాప్ 5 కేటగిరీలో చేరకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇదిలా ఉండగా, 25 కోట్లతో రూపొందించిన ఆర్య2 సినిమా అప్పట్లో 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 20 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా అప్పట్లో 5 కోట్ల రూపాయలు నష్టంతో బాక్సాఫీస్ జర్నీ ముగిసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే తాజగా ఈ సినిమా 4.75 కోట్ల రాబట్టింది. ఈ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లు అదనంగా మరికొంత చేరిందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











