Love Me 3 Days Collection: టాక్ ఒకలా కలెక్షన్లు ఇలా.. 3 రోజుల్లో అన్ని కోట్లు.. లవ్ మీ హిట్ కావాలంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో డార్క్ హర్రర్ థ్రిల్లర్‌గా వచ్చే సినిమాలకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందనే లభిస్తోంది. అందుకే గతంలో కంటే ఇప్పుడు అలాంటి చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. అలా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'లవ్ మీ'. దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశీష్ నటించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే, దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, దీనికి సంబంధం లేకుండా వసూళ్లు లభిస్తున్నాయి. మరి 'లవ్ మీ' మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!
లవ్ మీ అంటూ వచ్చేశారు:ఆశీష్ హీరోగా నటించిన డార్క్ హర్రర్ సినిమానే 'లవ్ మీ'. కిరణ్ భీమవరం తెరకెక్కించిన ఈ డార్క్ థ్రిల్లర్ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం ఇచ్చారు. ఇందులో సిమ్రన్ చౌదరి, రవి కృష్ణలు కీలక పాత్రల్లో నటించారు.

లవ్ మూవీ మూవీకి బిజినెస్:దిల్ రాజు ఫ్యామిలీ నుంచి పరిచయమైన ఆశీష్ నటించిన దెయ్యం సినిమానే 'లవ్ మీ'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 5.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది.
మూడో రోజు తెలుగులో ఇలా:అరుణ్ భీమవరం దర్శకత్వంలో యంగ్ హీరో ఆశీష్ నటించిన 'లవ్ మీ' చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా ఇది ఏమాత్రం ప్రభావాన్ని కోల్పోకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టింది. రెండో రోజు కూడా పర్వాలేదనిపించింది. ఇక, మూడో రోజు 'లవ్ మీ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 17 లక్షలు షేర్‌తో పాటు రూ. 40 లక్షలు గ్రాస్ రాబట్టింది.

3 రోజులకూ కలిపి ఎంత?:భారీ హిట్ కొట్టాలన్న లక్ష్యంతో ఆశీష్ నటించిన 'లవ్ మీ' మూవీకి మూడు రోజుల్లో పర్వాలేదనిపించే వసూళ్లు వచ్చాయి. ఇలా నైజాంలో ఈ సినిమా రూ. 74 లక్షలు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 84 లక్షలు షేర్ రాబట్టింది. ఇలా మూడు రోజుల్లో ఈ హర్రర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.58 కోట్లు షేర్, రూ. 3.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:ఆశీష్ - వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'లవ్ మీ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మూడు రోజుల్లో రూ. 1.58 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 27 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి మూడు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 1.85 కోట్లు షేర్‌తో పాటు రూ. 4.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన 'లవ్ మీ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.00 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో ఆశీష్ సినిమాకు రూ. 1.85 కోట్లు షేర్ వచ్చాయి. అంటే మరో రూ. 4.15 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











