Love Me 4 Days Collection: ఆ మార్క్ దాటిన లవ్ మీ.. 4 రోజుల్లో భారీగానే.. కానీ, హిట్ కావాలంటేనే!
టాలీవుడ్‌లోకి సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీల నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే హైలైట్ అయ్యారు. అలాంటి వారిలో దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశీష్ ఒకడు. ఫస్ట్ మూవీతో హిట్ కొట్టలేకపోయిన అతడు.. ఇప్పుడు ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో 'లవ్ మీ' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి టాక్ అంత మంచిగా రాకున్నా ప్రేక్షకుల స్పందన మాత్రం బాగానే వస్తోంది. ఈ నేపథ్యంలో ఆశీష్ నటించిన 'లవ్ మీ' మూవీ నాలుగు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!
దెయ్యంతో ప్రేమ కథ అని:ఆశీష్ హీరోగా నటించిన క్రేజీ హర్రర్ సినిమానే 'లవ్ మీ'. కిరణ్ భీమవరం తెరకెక్కించిన ఈ డార్క్ థ్రిల్లర్ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి నిర్మించారు. ఇందులో సిమ్రన్ చౌదరి, రవి కృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం ఇచ్చారు.

లవ్ మూవీ మూవీకి బిజినెస్:సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న ఆశీష్ నటించిన దెయ్యం సినిమానే 'లవ్ మీ'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 5.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.
4వ రోజు తెలుగులో ఎంత?:అరుణ్ భీమవరం డైరెక్షన్‌లో యంగ్ హీరో ఆశీష్ నటించిన 'లవ్ మీ' చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా ఇది ఏమాత్రం ప్రభావాన్ని కోల్పోకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టింది. రెండో రోజు నుంచి కాస్త డౌన్ అవుతూ వస్తోంది. ఇలా నాలుగో రోజు 'లవ్ మీ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 లక్షలు షేర్, రూ. 35 లక్షలు గ్రాస్ లభించింది.

4 రోజులకూ కలిపి ఎంత?:దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆశీష్ నటించిన 'లవ్ మీ' మూవీకి నాలుగు రోజుల్లో పర్వాలేదనిపించే వసూళ్లు వచ్చాయి. ఇలా నైజాంలో ఈ సినిమా రూ. 80 లక్షలు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 93 లక్షలు షేర్ రాబట్టింది. ఇలా నాలుగు రోజుల్లో ఈ హర్రర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.73 కోట్లు షేర్, రూ. 3.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:ఆశీష్ - వైష్ణవి చైతన్య జోడీగా నటించిన 'లవ్ మీ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాలుగు రోజుల్లో రూ. 1.73 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 30 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 2.03 కోట్లు షేర్‌తో పాటు రూ. 4.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:విభిన్నమైన కథతో రూపొందిన 'లవ్ మీ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.00 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో ఆశీష్ సినిమాకు రూ. 2.03 కోట్లు షేర్ వచ్చాయి. అంటే మరో రూ. 3.97 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











