Love Me 5 Days Collection: లవ్ మీ మూవీకి షాకింగ్ వసూళ్లు.. 5 రోజుల్లో అది దాటేసి.. కానీ హిట్ కావాలంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కాన్సెప్టులతో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ఆరంభం నుంచే హైప్ క్రియేట్ చేసుకుంటున్నాయి. అలాంటి చిత్రాల్లో డార్క్ థ్రిల్లర్‌గా రూపొందిన 'లవ్ మీ' ఒకటి.

దిల్ రాజు ఫ్యామిలీకి చెందిన ఆశీష్ హీరోగా నటించిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, ఊహించని విధంగా మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. కానీ, ఇప్పుడు క్రమంగా ఇది డౌన్ అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 'లవ్ మీ' మూవీ ఐదు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

Ashish and Vaishnavi Chaitanya Starrer Love Me Movie 5 Days Worldwide Collections Details

దెయ్యంతో హీరో లవ్ స్టోరీ
ఆశీష్ హీరోగా నటించిన డార్క్ హర్రర్ సినిమానే 'లవ్ మీ'. కిరణ్ భీమవరం తెరకెక్కించిన ఈ డార్క్ థ్రిల్లర్ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి నిర్మించారు. ఇందులో సిమ్రన్ చౌదరి, రవి కృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేశారు.

Ashish and Vaishnavi Chaitanya Starrer Love Me Movie 5 Days Worldwide Collections Details

లవ్ మూవీ మూవీకి బిజినెస్

కెరీర్‌లో మొదటి హిట్ కోసం చూస్తున్న ఆశీష్ నటించిన హర్రర్ సినిమానే 'లవ్ మీ'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 5.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది.

Ashish and Vaishnavi Chaitanya Starrer Love Me Movie 5 Days Worldwide Collections Details

5వ రోజు తెలుగులో ఎంత?
అరుణ్ భీమవరం - యంగ్ హీరో ఆశీష్ కాంబినేషన్‌లో రూపొందిన 'లవ్ మీ' చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా ఇది ఏమాత్రం ప్రభావాన్ని కోల్పోకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టింది. అయితే, వీక్ డేస్‌లో కాస్త డౌన్ అవుతోంది. ఇలా ఐదో రోజు 'లవ్ మీ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 లక్షలు షేర్‌, రూ. 40 లక్షలు గ్రాస్ లభించింది.

5 రోజులకూ కలిపి ఎంత?

దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశీష్ నటించిన 'లవ్ మీ' మూవీకి ఐదు రోజుల్లో పర్వాలేదనిపించే వసూళ్లు వచ్చాయి. ఇలా నైజాంలో ఈ సినిమా రూ. 85 లక్షలు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1.02 కోట్లు షేర్ రాబట్టింది. ఇలా ఐదు రోజుల్లో ఈ హర్రర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.89 కోట్లు షేర్, రూ. 4.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Ashish and Vaishnavi Chaitanya Starrer Love Me Movie 5 Days Worldwide Collections Details

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
ఆశీష్ - వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'లవ్ మీ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐదు రోజుల్లో రూ. 1.89 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 33 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి ఐదు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 2.22 కోట్లు షేర్‌తో పాటు రూ. 4.95 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Ashish and Vaishnavi Chaitanya Starrer Love Me Movie 5 Days Worldwide Collections Details

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?

డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందిన 'లవ్ మీ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.00 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో ఆశీష్ సినిమాకు రూ. 2.22 కోట్లు షేర్ వచ్చాయి. అంటే మరో రూ. 3.78 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X