Love Me 7 Days Collection: 6 కోట్లు రావాలి.. వారంలో వచ్చింది ఇంతే.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!
టాలీవుడ్‌లోకి ఎంతో మంది స్టార్లు తమ వారసులను పరిచయం చేశారు. అలా ఇప్పటికే చాలా మంది కుర్రాళ్లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో దిల్ రాజు ఫ్యామిలీ నుంచి అడుగు పెట్టిన ఆశీష్ ఒకడు. మొదటి చిత్రంతో సరైన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయిన అతడు.. ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న లక్ష్యంతో 'లవ్ మీ' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఆశించిన రీతిలో వసూళ్లు లభించడం లేదు. ఈ నేపథ్యంలో 'లవ్ మీ' మూవీ వారం రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!
క్రేజీ కంటెంట్‌తో లవ్ మీ:ఆశీష్ హీరోగా నటించిన డిఫరెంట్ హర్రర్ సినిమానే 'లవ్ మీ'. కిరణ్ భీమవరం తెరకెక్కించిన ఈ డార్క్ థ్రిల్లర్ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి నిర్మించారు. ఇందులో సిమ్రన్ చౌదరి, రవి కృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి మ్యూజిక్ ఇచ్చారు.

లవ్ మూవీ మూవీకి బిజినెస్:తొలిసారి విజయాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో ఆశీష్ నటించిన హర్రర్ సినిమానే 'లవ్ మీ'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 5.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది.
7వ రోజు తెలుగులో ఎంత?:అరుణ్ భీమవరం - యంగ్ హీరో ఆశీష్ కలయికలో తెరకెక్కిన 'లవ్ మీ' చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా ఇది ఏమాత్రం ప్రభావాన్ని కోల్పోకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టింది. అయితే, వీక్ డేస్‌లో కాస్త డౌన్ అవుతోంది. ఇలా ఏడో రోజు 'లవ్ మీ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ లభించింది.

7 రోజులకూ కలిపి ఎంత?:దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆశీష్ నటించిన 'లవ్ మీ' మూవీకి ఏడు రోజుల్లో పర్వాలేదనిపించే వసూళ్లు వచ్చాయి. ఇలా నైజాంలో ఈ సినిమా రూ. 1.02 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1.17 కోట్లు షేర్ రాబట్టింది. ఇలా ఏడు రోజుల్లో ఈ హర్రర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.19 కోట్లు షేర్, రూ. 4.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:ఆశీష్ - వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన 'లవ్ మీ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏడు రోజుల్లో రూ. 2.19 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 34 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి ఏడు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 2.53 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందిన 'లవ్ మీ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.00 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లో ఆశీష్ సినిమాకు రూ. 2.53 కోట్లు షేర్ వచ్చాయి. అంటే మరో రూ. 3.47 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











