Love Me Closing Collection: 6 కోట్లు రావాలి.. ఫైనల్‌గా వచ్చింది ఇంతే.. దిల్ రాజుకు ఎన్ని కోట్ల నష్టమంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఇప్పటికే ఎంతో మంది స్టార్లు తమ వారసులను పరిచయం చేశారు. కానీ, అందులో కొందరు మాత్రమే మంచి గుర్తింపును తెచ్చుకోగా.. మిగిలిన వాళ్లు సక్సెస్ కోసం చూస్తున్నారు. అలాంటి వారిలో దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఎంటరైన ఆశీష్ ఒకడు. ఈ యంగ్ హీరో తాజాగా నటించిన సినిమానే 'లవ్ మీ'. హర్రర్ లవ్ స్టోరీతో రూపొందిన ఈ చిత్రానికి టాక్‌తో పాటు రెస్పాన్స్ కూడా ఆశించినట్లుగా రాలేదు. ఫలితంగా ఈ మూవీ తక్కువ వసూళ్లతోనే రన్ ముగించింది. ఈ నేపథ్యంలో 'లవ్ మీ' మూవీ టోటల్‌గా ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

హర్రర్ కంటెంట్‌తో లవ్ మీ:ఆశీష్ హీరోగా నటించిన హర్రర్ కంటెంట్ సినిమానే 'లవ్ మీ'. కిరణ్ భీమవరం తెరకెక్కించిన ఈ డార్క్ థ్రిల్లర్ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి నిర్మించారు. ఇందులో సిమ్రన్ చౌదరి, రవి కృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని ఇచ్చారు.

Ashish and Vaishnavi Chaitanya Starrer Love Me Movie Closing Worldwide Collections Details

లవ్ మూవీ మూవీకి బిజినెస్:కెరీర్‌లో మొదటి విజయాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో ఆశీష్ నటించిన హర్రర్ సినిమానే 'లవ్ మీ'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 5.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుంది.

అలాంటి టాక్‌తో తక్కువగా:అరుణ్ భీమవరం - యంగ్ హీరో ఆశీష్ కలయికలో తెరకెక్కిన 'లవ్ మీ' చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా ఇది ఏమాత్రం ప్రభావాన్ని కోల్పోకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టింది. అయితే, వీక్ డేస్‌లో కాస్త డౌన్ అవుతోంది. ఆ తర్వాత కూడా ఈ సినిమా అంతగా కోలుకోలేకపోయింది. ఫలితంగా ఈ చిత్రం కలెక్షన్లు తక్కువగానే రాణించింది.

Ashish and Vaishnavi Chaitanya Starrer Love Me Movie Closing Worldwide Collections Details

తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే:దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆశీష్ నటించిన 'లవ్ మీ' మూవీకి ఫుల్ రన్‌లో తక్కువ రెస్పాన్స్‌నే అందుకుంది. ఇలా నైజాంలో ఈ సినిమా రూ. 1.10 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1.25 కోట్లు షేర్ రాబట్టింది. ఇలా ముగింపు సమయానికి ఈ హర్రర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.35 కోట్లు షేర్, రూ. 4.90 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:ఆశీష్ - వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'లవ్ మీ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగింపు సమయానికి రూ. 2.35 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 40 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి ఫుల్ రన్‌లో ఈ చిత్రానికి రూ. 2.75 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.30 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Ashish and Vaishnavi Chaitanya Starrer Love Me Movie Closing Worldwide Collections Details

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:డిఫరెంట్ సబ్జెక్టుతో రూపొందిన 'లవ్ మీ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.00 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో ఆశీష్ సినిమాకు రూ. 2.75 కోట్లు షేర్ వచ్చాయి. తద్వారా ఈ మూవీ రూ. 3.25 కోట్లు నష్టాలను చవి చూసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X