Love Me Day 1 Collection: లవ్ మీ మూవీకి ఊహించని వసూళ్లు.. తొలి రోజు అన్ని కోట్లు.. ఆశీష్ నయా రికార్డు

టాలీవుడ్‌లో సినీ వారసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎంతో మంది స్టార్లు తమ పిల్లలను సినీ రంగంలోకి తీసుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ మధ్యనే దిల్ రాజు కూడా తన ఫ్యామిలీ నుంచి ఆశీష్‌ను హీరోగా తీసుకు వచ్చారు.

మొదటి చిత్రంతో మెప్పించిన అతడు.. విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. దీంతో ఫస్ట్ హిట్ కోసం ఇప్పుడు 'లవ్ మీ' అనే సినిమాలో నటించాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ లభించింది? మొదటి రోజు ఎంత కలెక్షన్ వచ్చింది? అనేవి మీరే చూసేయండి!

Ashish and Vaishnavi Chaitanya Starrer Love Me Movie Day 1 Worldwide Collections Details

దెయ్యంతో ప్రేమలో పడ్డ హీరో
ఆశీష్ హీరోగా నటించిన డార్క్ థ్రిల్లర్ మూవీనే 'లవ్ మీ'. కిరణ్ భీమవరం తెరకెక్కించిన ఈ డార్క్ థ్రిల్లర్ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం ఇచ్చారు. ఇందులో సిమ్రన్ చౌదరి, రవి కృష్ణలు కీలక పాత్రలు చేశారు.

లవ్ మూవీ మూవీకి బిజినెస్

దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశీష్ నటించిన దెయ్యం సినిమానే 'లవ్ మీ'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 5.50 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

Ashish and Vaishnavi Chaitanya Starrer Love Me Movie Day 1 Worldwide Collections Details

మిక్స్‌డ్ టాక్‌తోనూ ఎక్కువే
థ్రిల్‌కు గురి చేసే కాన్సెప్టుతో రూపొందిన 'లవ్ మీ' మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్‌లోనే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుందని చెప్పాలి.

తొలి రోజు తెలుగులో ఇలా

అరుణ్ భీమవరం దర్శకత్వంలో యంగ్ హీరో ఆశీష్ నటించిన 'లవ్ మీ' చిత్రంపై ఆరంభంలోనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, ఈ సినిమా టాక్‌ను అనుకున్న విధంగా తెచ్చుకోలేకపోయింది. అయినప్పటికీ మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిసి ఈ హర్రర్ థ్రిల్లర్ సినిమాకు రూ. 2.40 కోట్లు గ్రాస్, రూ. 1.10 కోట్లు షేర్ వసూలు అయింది.

Ashish and Vaishnavi Chaitanya Starrer Love Me Movie Day 1 Worldwide Collections Details

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'లవ్ మీ' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 2.40 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 20 లక్షలు గ్రాస్‌ను మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి మొదటి రోజు ఈ చిత్రానికి రూ. 2.60 కోట్లు గ్రాస్, రూ. 1.20 కోట్లు షేర్ వచ్చింది. తద్వారా ఆశీష్ కెరీర్‌లో ఇది బెస్ట్ ఓపెనింగ్స్‌ను అందుకుంది.

Ashish and Vaishnavi Chaitanya Starrer Love Me Movie Day 1 Worldwide Collections Details

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?

డిఫరెంట్ స్టోరీతో వచ్చిన 'లవ్ మీ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.00 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు ఆశీష్ సినిమాకు రూ. 1.20 కోట్లు షేర్ వచ్చాయి. అంటే మరో రూ. 4.80 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X