Love Me Business: లవ్ మీ మూవీకి షాకింగ్ బిజినెస్.. ఏకంగా అన్ని కోట్లు.. ఆశీష్ హిట్ కొట్టాలంటే మాత్రం!

తెలుగు సినిమా పరిశ్రమ నుంచి డార్క్ థ్రిల్లర్ మూవీలు పెద్దగా రావడం లేదు. అలా వచ్చిన వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో ఈ మధ్య కాలంలో ఇలాంటి చిత్రాల సంఖ్య కాస్త పెరిగిపోతోంది. ఇలా ఇప్పుడు ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చిన సినిమానే 'లవ్ మీ'. దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆశీష్ నటించిన ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. దీంతో ఇది మంచి బిజినెస్ చేసుకుని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఇంతకీ 'లవ్ మీ' సినిమాకు ఎన్ని కోట్లు వ్యాపారం జరిగిందో మీరే తెలుసుకోండి మరి!

లవ్ మీ అంటూ ఆశీష్ రాక
ఆశీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే 'లవ్ మీ'. కిరణ్ భీమవరం తెరకెక్కించిన ఈ డార్క్ థ్రిల్లర్ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం ఇచ్చారు. ఇందులో సిమ్రన్ చౌదరి, రవి కృష్ణలు కీలక పాత్రల్లో కనిపించారు.

Ashish and Vaishnavi Chaitanya Starrer Love Me Movie Pre Release Business

డిఫరెంట్ కథతో వచ్చింది
ఏది చేయొద్దు అంటే అది చేసే ఓ కుర్రాడు.. దెయ్యం జోలికి వెళ్తాడు. తర్వాత దాన్ని ప్రేమించి, ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాడు. ఆ తర్వాత ఆ దెయ్యానికి ఉన్న ఒక సమస్యను తీర్చడం అనే కాన్సెప్టుతో తెరకెక్కిన సినిమానే 'లవ్ మీ'. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీంతో విడుదలకు ముందే ఇది అంచనాలను ఏర్పరచుకుంది.

గ్రాండ్ రిలీజ్.. టాక్ అలా
సరైన భారీ విజయం కోసం వేచి చూస్తోన్న ఆశీష్ నటించిన 'లవ్ మీ' మూవీ ఎన్నో అంచనాలతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి స్పందన కూడా మోస్తరుగా లభిస్తోంది. ఇదే కంటిన్యూ అయితే కలెక్షన్లు కూడా ఏవరేజ్‌గానే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Ashish and Vaishnavi Chaitanya Starrer Love Me Movie Pre Release Business

సినిమా ప్రీ బిజినెస్ ఇలా
దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశీష్ నటించిన చిత్రం కావడంతో పాటు కొత్త కాన్సెప్టుతో వచ్చిన 'లవ్ మీ' మూవీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పైగా దీని నుంచి వచ్చి ప్రచార చిత్రాలు అన్నీ ఆకట్టుకోవడంతో హైప్ భారీగా పెరిగిపోయింది. ఫలితంగా ఆశీష్ నటించిన ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో కలిపి రూ. 4.50 కోట్లు మేరు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే
ఆశీష్ - వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో రూపొందిన 'లవ్ మీ' మూవీపై అందరూ బాగానే ఫోకస్ చేశారు. అందుకు తగ్గట్లే మార్కెట్ పరంగా ఇది బయ్యర్ల దృష్టిని ఆకట్టుకుంది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 1.00 కోట్లకు అమ్ముడైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 5.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది.

Ashish and Vaishnavi Chaitanya Starrer Love Me Movie Pre Release Business

అన్ని కోట్లు వస్తేనే హిట్
ఆశీష్ నటించిన 'లవ్ మీ' సినిమాకు ఊహించని విధంగా రూ. 5.50 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 6.00 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వసూలు చేస్తేనే 'లవ్ మీ' సినిమా కమర్షియల్‌గా విజయం సాధిస్తుంది. మౌత్ టాక్ మంచిగా వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొత్తం రాబట్టడం కష్టమేమీ కాదు అనే చెప్పుకోవాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X