Hidimba 3 Days Collections: హిడింబకు ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో అన్ని కోట్లు.. ఇంకెంత రావాలంటే!
సరైన టాలెంట్ ఉన్నా ఆశించిన స్థాయిలో హిట్లు సాధించలేని హీరోలు టాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు ఒకడు. చాలా ఏళ్ల క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. కొన్ని హిట్లు సాధించినా ఎందుకనో ప్రభావాన్ని చూపలేకపోయాడు.
అయినప్పటికీ ప్రయత్నాలు మాత్రం ఆపకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా ఇప్పుడు 'హిడింబ' అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీని చేశాడు. ఇది ఆరంభంలోనే అంచనాలను ఏర్పరచుకుని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

అశ్విన్ బాబు హీరోగా అనిల్ కుమార్ కన్నెగంటి దర్శకత్వంలో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీనే 'హిడింబ'. మంచి అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. కానీ, మొదటి రోజు ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన దక్కలేదు. అయితే, రెండో రోజు నుంచి ఇది మంచిగానే పుంజుకుంది. ఫలితంగా ఒక రోజుకు మించి మరో రోజు మంచి వసూళ్లను రాబడుతోంది.
అశ్విన్ బాబు - నందితా శ్వేత జంటగా నటించిన 'హిడింబ' మూవీకి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.69 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అందులో నైజాంలోనే రూ. 2.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 60 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.10, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి రూ. 49 లక్షలు వచ్చాయని తెలిసింది. అలాగే, ఈ చిత్రం రూ. 1.80 కోట్లు వరకూ షేర్ దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
'హిడింబ' చిత్రం రూ. 3.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 3.20 కోట్లు షేర్ రాబట్టాలి. ఇక, అశ్విన్ బాబు నటించిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 1.80 కోట్లు షేర్ వసూలు చేయడంతో.. ఇంకా రూ. 1.40 కోట్లు షేర్ కలెక్ట్ చేస్తేనే ఇది కమర్షియల్‌గా క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుందని చెప్పొచ్చు.
ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన 'హిడింబ' మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో ఎస్వీకే సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. వికాస్ బాడిస సంగీతాన్ని అందించారు. మకరంద్ దేశ్‌పాండే, రఘు కుంచె కీలక పాత్రలు చేశారు.


Click it and Unblock the Notifications











