Hidimba Day 1 Collections: హిడింబకు షాకింగ్ కలెక్షన్లు.. తొలి రోజు ఇంతే.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!
టాలీవుడ్‌లో చాలా మంది స్టార్లు తమ సోదరులను కూడా పరిచయం చేశారు. అందులో ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ బ్రదర్ అశ్విన్ బాబు ఒకడు. చాలా కాలం క్రితమే హీరోగా పరిచయమైన అతడు.. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించాడు. అందులో కొన్ని విజయాలు కూడా ఉన్నాయి. కానీ, అశ్విన్ బాబుకు కావాల్సిన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా మంచి సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో 'హిడింబ' అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. ఆరంభం నుంచే అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అనిల్ కుమార్ కన్నెగంటి దర్శకత్వంలో యంగ్ హీరో అశ్విన్ బాబు నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'హిడింబ' మూవీ ప్రచారం చిత్రాలకు మంచి రెస్పాన్స్ రావడంతో విడుదలకు ముందే హైప్ ఏర్పరచుకుంది. అందుకు తగ్గట్లుగానే ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన దక్కలేదు. ఈ ప్రభావం మొదటి రోజు కలెక్షన్లపై చూపుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీకి తొలి రోజే చాలా తక్కువగానే వసూళ్లు దక్కాయి.

క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన 'హిడింబ' మూవీకి టాక్‌కు తగ్గట్లుగానే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.00 - 1.10 కోట్లు వరకూ గ్రాస్, రూ. 50 - 55 లక్షలు వరకూ షేర్‌ను వసూలు చేసింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ చూస్తే ఇది రూ. 1.20 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 60 లక్షల వరకూ షేర్ రాబట్టింది. ఇక, ఈ చిత్రం రూ. 3.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 3.50 కోట్లు షేర్ రాబట్టాలి. అంటే ఇంకా రూ. 2.90 కోట్లు షేర్ వసూలు అయితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

'హిడింబ' మూవీలో నందిత శ్వేత హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో ఎస్వీకే సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. వికాస్ బాడిస సంగీతాన్ని అందించారు. మకరంద్ దేశ్‌పాండే, రఘు కుంచె కీలక పాత్రలు చేశారు.


Click it and Unblock the Notifications











