Shivam Bhaje Day 1 Collections: శివం భజేకు తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు.. అసలు ఎన్ని కోట్లు రావాలంటే!

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు వాళ్ల ఫ్యామిలీ నుంచి కొందరిని హీరోలుగా పరిచయం చేస్తున్నారు. అలా టాలీవుడ్‌లోకి వచ్చిన వారిలో ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ బ్రదర్ అశ్విన్ బాబు ఒకడు. అప్పుడెప్పుడో హీరోగా పరిచయమైన అతడు.. ఇప్పటికే చాలా సినిమాలు చేశాడు. కానీ, అశ్విన్ బాబుకు కావాల్సిన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా మంచి సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో 'శివం భజే' అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. మరి దీనికి మొదటి రోజు ఎంత వసూళ్లు వచ్చాయో మీరే చూసేయండి!

శివం భజే అంటూ వచ్చాడు
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రమే 'శివం భజే'. అప్సర్ అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి నిర్మించారు. ఇందులో అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, తనికెళ్ళ భరణిలు కీలక పాత్రలు పోషించారు. వికాస్ బాడిస దీనికి సంగీతం అందించారు.

Ashwin Babu Starrer Shivam Bhaje Movie Day 1 Box Office Collections

అశ్విన్ సినిమాకు బిజినెస్

సుదీర్ఘ కాలంగా విజయం కోసం ఎదురు చూస్తోన్న అశ్విన్ బాబు నటించిన చిత్రమే 'శివం భజే'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 4.00 కోట్లు వరకూ బిజినెస్ జరుపుకుంది.

డీసెంట్ టాక్‌తో రెస్పాన్స్
డివోషనల్ అండ్ మిస్టరీ స్టోరీతో వచ్చిన 'శివం భజే' మూవీ గత గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్‌లోనే అంటే తక్కువగానే లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలోనే కంటే డల్ వసూళ్లు వస్తాయని టాక్ వినిపించింది.

Ashwin Babu Starrer Shivam Bhaje Movie Day 1 Box Office Collections

తొలి రోజు అన్ని లక్షలు

'శివం భజే' మూవీకి టాక్‌కు తగ్గట్లుగానే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం రూ. 30 లక్షలు వరకూ షేర్ మాత్రమే వసూలు చేసింది. అలాగే, రూ. 55 లక్షలు గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా మిగిలిన ఏరియాలు కలిపి రూ. 40 లక్షలు షేర్, రూ. 85 లక్షలు గ్రాస్ రాబట్టింది.

ఎంత వసూలు చేయాలి?
డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందిన 'శివం భజే' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలూ కలుపుకుని రూ. 4.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 4.50 కోట్లు షేర్ రాబట్టాలి. ఇది తొలి రోజు రూ. 40 లక్షలు షేర్ మాత్రమే రాబట్టింది. అంటే ఇంకా రూ. 4.10 కోట్లు షేర్ వసూలు అయితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X