twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జగదేకవీరుడు‘కు చిరంజీవి, శ్రీదేవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అశ్వినీదత్‌కు లాభం ఎంతంటే!

    |

    మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. దీంతో అభిమానుల్లో ఆ చిత్రానికి సంబంధించిన మధురసృతులను మరోసారి గుర్తు చేసుకొన్నారు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చిరంజీవి, నిర్మాత అశ్వినిదత్, దర్శకుడు రాఘవేంద్రరావు తదితరులు తమ అనుభవాలను చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, శ్రీదేవి తీసుకొన్న రెమ్యునరేషన్ విషయాన్ని అశ్వినీదత్ వెల్లడించిన తీరు ఆసక్తిని రేపింది. ఆ ఇద్దరు అగ్రతారలు ఎంత రెమ్యునరేషన్ తీసుకొన్నారంటే..

    బాక్సాఫీస్‌ వద్ద కాసుల పంట

    బాక్సాఫీస్‌ వద్ద కాసుల పంట


    టాలీవుడ్‌లో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఓ మైలురాయిగా నిలిచింది. మే 9వ తేది, 1990న రిలీజైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని కాసులు పంట పండించింది. బాక్సాఫీస్ రికార్డులను ఓ సారి దులిపేసి కొత్త రికార్డులను సెట్ చేసింది. ఈ చిత్రం అప్పట్లో రూ.13 కోట్ల గ్రాస్, 8 కోట్ల నికర వసూళ్లను సాధించడం ఓ రికార్డు.

    30 ఏళ్ల క్రితం అనుభూతులు

    30 ఏళ్ల క్రితం అనుభూతులు


    ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ఇతర భాషల్లో దుమ్మురేపింది. చిరంజీవి, శ్రీదేవికి మరుపురాని విజయాన్ని అందించింది. ఇలాంటి సందర్భంలో మన మధ్య లేని శ్రీదేవి గురించి చిరంజీవి, అశ్వినిదత్, శ్రీదేవి తలచుకొని భావోద్వేగానికి గురయ్యారు. అలా మీడియాతో 30 ఏళ్ల క్రితం జగదేక వీరుడు అతిలోక సుందరి నిర్మాణం గురించి, సినిమాకు సంబంధించి తమ అనుభూతులను పంచుకొంటూ అశ్వినిదత్ కొందరి రెమ్యునరేషన్ల గురించి ప్రస్తావించారు.

    చిరంజీవి, శ్రీదేవి రెమ్యునరేషన్స్

    చిరంజీవి, శ్రీదేవి రెమ్యునరేషన్స్


    జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో నటించినందుకు గాను చిరంజీవికి రూ.35 లక్షల పారితోషికం ఇచ్చాం. అలాగే శ్రీదేవి అగ్రతార కావడంతో ఆమెకు కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చాం. ఈ సినిమాలో నటించినందుకు రూ.25 లక్షల రూపాయలను ఆమెకు ముట్టజెప్పాం అని అశ్వినీదత్ చెప్పారు. ఈ మొత్తాలు అప్పట్లో ఏ హీరోకైనా ఎక్కువే అని చెప్పుకొచ్చారు.

    Recommended Video

    Yash KGF Chapter 2 Shooting at Rajahmundry || రాజమండ్రి లో కేజియఫ్ 2 సినిమా షూటింగ్
    అశ్వినీదత్‌కు లాభం ఎంతంటే

    అశ్వినీదత్‌కు లాభం ఎంతంటే


    అదే విధంగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం తనకు మంచి అనుభూతిని పంచడమే కాకుండా పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించినందుకు ఖర్చులు, రెమ్యునరేషన్లు అన్నీ పోయిన తర్వాత నాకు రూ.35 లక్షలు లాభం వచ్చింది అని అశ్వినీదత్ చెప్పారు. ఈ చిత్రం కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి మంచి రెమ్యునరేషన్‌తోపాటు ఓ సరికొత్త అనుభవాన్ని దక్కించుకొన్నారు.

    English summary
    30 years of Jagadeka Veerudu Athiloka Sundari: Jagadeka Veerudu Athiloka Sundari is a film, directed by K. Raghavendra Rao, from a screenplay written by Rao and Jandhyala. The Indian Super Stars Chiranjeevi and Sridevi in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X