రజినీకాంత్ ‘జైలర్’ తెలుగు హక్కులు ఆ సంస్థకే.. చిరంజీవి సినిమాపై ప్రభావం!

పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. విలక్షణమైన నటనతో పాటు ప్రత్యకమైన మేనరిజంతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా సౌతిండియాలోనే బడా స్టార్‌గా వెలుగొందుతోన్న ఆయన.. ఏజ్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇలా గత ఏడాది 'అన్నత్తే' అనే సినిమాతో సందడి చేశారు. అయితే, ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో రజినీకాంత్.. నెల్సన్ దర్శకత్వంలో 'జైలర్' అనే సినిమాలో నటిస్తోన్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'జైలర్' మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. గతంలో మాదిరిగా కాకుండా దీన్ని ఏమాత్రం బ్రేకులు తీసుకోకుండానే రజినీకాంత్ శరవేగంగా చేసుకుంటూ వచ్చారు. ఇలా తాజాగానే ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. దీంతో వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకునేలా ప్లాన్ చేసుకున్నారు. ఒకవైపు షూట్ పూర్తి కావడంతో నిర్మాతలు దీని బిజినెస్‌పై ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా తెలుగు రాష్ట్రాల హక్కులను క్లోజ్ చేసినట్లు ప్రకటించారు.

Asian Cinemas Bagged Rajinikanth Jailer Movie Telugu Rights

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'జైలర్' మూవీని ఆగస్టు 10వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏరియాల హక్కులను ప్రముఖ సంస్థ ఏషియన్ సినిమాస్‌కు విక్రయించారు. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో పెద్ద థియేటర్ చైన్ ఉన్న ఏషియన్ సంస్థ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్లు చేస్తోంది. ఇక, ఈ సంస్థకు 'జైలర్' హక్కులు దక్కడం.. ఆగస్టు 11వ తేదీన విడుదలయ్యే 'భోళా శంకర్'పై ప్రభావాన్ని చూపే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. రజినీకాంత్ - నెల్సన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'జైలర్' మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తుండగా.. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X