Assi Day 1 Collection: అస్సీకి తొలిరోజు షాకింగ్ కలెక్షన్స్.. తాప్సీ పన్ను మూవీ బాక్సాఫీస్ పరిస్ధితి ఏంటీ?
ఒకప్పుడు తన అందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు ఉత్తరాది భామ తాప్సీ పన్ను. కానీ అందరు హీరోయిన్ల మాదిరిగానే ఆమెకు బాలీవుడ్‌పై మోజు పుట్టి అక్కడే సెటిలైపోయింది. ఒకటి రెండు హిట్లు తప్పించి హిందీ చిత్ర పరిశ్రమలో తాప్సీ కెరీర్‌లో పెద్దగా మెరుపులు లేవు. కానీ ఏదో కిందా మీదా పడుతూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు తాప్సీ. దోబారా, తడ్కా, బ్లర్, ధక్ ధక్, డూంకీ, ఖేల్ ఖేల్ మై తదితర సినిమాలలో ఆమె నటించారు.
కోర్ట్ డ్రామాగా అస్సీ
తాజాగా తాప్సీ పన్ను లీడ్ రోల్‌లో నటించిన చిత్రం అస్సీ. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాల బ్యాక్‌డ్రాప్‌లో యదార్థ ఘటనల తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అస్సీ. కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సీ పన్ను పవర్‌ఫుల్ లాయర్‌గా నటించారు. ఫిబ్రవరి 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో అస్సీ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే.

అస్సీ తారాగణం
టీ సిరీస్ ఫిల్మ్స్, బెనారస్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృషన్ కుమార్, అనుభవ్ సిన్హాలు సంయుక్తంగా అస్సీ మూవీని నిర్మించగా.. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. తాప్సీతో పాటు కని కుస్రుతి, రేవతి, మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా, మహమ్మద్ జీషన్ ఆయూబ్, సత్యజిత్ శర్మ, విపుల్ గుప్తా తదితరులు కీలకపాత్రలు పోషించారు. సీతా పహ్వా, సుప్రీయ పాఠక్, నసీరుద్దీన్ షాలు గెస్ట్ రోల్‌లో అలరించారు. ఈవారం ముల్లిగన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. అమర్జిత్ సింగ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. రంజిత్ బరత్ సంగీత దర్శకత్వం వహించారు.
అస్సీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి అస్సీ మూవీకి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్ తదితర ప్రమోషనల్ కార్యక్రమాలతో అస్సీ మూవీకి ఓ మాదిరిగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
అస్సీ మూవీ కలెక్షన్స్
కోర్ట్ రూమ్ డ్రామా అయినప్పటికీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అస్సీ మూవీకి సాయంత్రం 5 గంటల వరకు హిందీలో 5.56 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదవ్వగా.. ముంబైలో 320 షోలు, ఢిల్లీలో 422 షోలు, బెంగళూరులో 156 షోలు, కోల్‌కతాలో 105 షోలు, అహ్మదాబాద్‌లో 154 షోలు ప్రదర్శితమైనట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం అస్సీ మూవీకి తొలిరోజు 42 లక్షల రూపాయల నెట్ వసూలైనట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. దాంతో ఈ సినిమాకు తొలిరోజు దారుణంగా వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ డే ఈ అస్సీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 3 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రావొచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











